డీఆర్ఎస్ తీసుకోవడమే రాదు..మీకు కప్ కావాలా..

డీఆర్ఎస్ తీసుకోవడమే రాదు..మీకు కప్ కావాలా..

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా జోక్‌లు పేలుతున్నాయి.మెుదటి బ్యాటింగ్ చేపిన కంగారూలు 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ కాగా..పాక్ 266 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌లో పాక్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కీలక సమయంలో 5 బంతుల్లో 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమితో పాకిస్థాన్‌పై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అభినందన్‌ను అపహాస్యం చేస్తూ రూపోదించిన యాడ్‌లో ఇండియా టీ కప్ కోసం వరల్డ్ కప్‌ ఆడుతోందంటూ ఫ్యాన్స్ ఎద్దేవా చేసిన ప్రకటన పాక్ టీవీల్లోప్రసారం అయింది. దీంతో ఆ ప్రకటనలపై ఫైర్ అయిన అభిమానులు బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిని ఉద్దేశిస్తూ ట్రోల్స్ మెుదలుపెట్టారు. పాక్ ఫెలవ ఫీల్డిండ్ కెప్టెన్ సర్ఫరాజ్ డీఆర్ఎస్(అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్) నిర్ణయాలను ఉద్దేశించి ట్వీట్లు చేసి పాకిస్థాన్ టీంతో ఆటాడుకుంటున్నారు.

అలాగే మ్యాచ్ ఓటమిపై పాక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆటగాళ్ళపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఇంగ్లాండ్ గడ్డ గడ్డ మీద మరోసారి విఫలం కావడాన్ని పాక్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న విఫల ఆటగాడంటూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story