టీ20ల నుంచి రిటైర్.. ప్రపంచ కప్ నా కల: మిథాలీరాజ్

వెటరన్ ఇండియా బ్యాటర్ మిథాలీ రాజ్ మంగళవారం (సెప్టెంబర్ 3) టి 20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2006 లో భారతదేశపు మొట్టమొదటి టి 20 కెప్టెన్‌గా ఉన్న మిథాలీ రాజ్ అతి తక్కువ కాలంలో 89 మ్యాచ్‌లు ఆడి, 2364 పరుగులు సాధించింది. 2012, 2014, 2016లో ప్రపంచకప్‌లతో సహా 32 మ్యాచ్‌ల్లో ఆమె భారత్‌కు నాయకత్వం వహించింది. ఆమె చివరి T20 ప్రదర్శన ఇంగ్లాండ్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో అజేయంగా 32 బంతుల్లో 30 పరుగులు చేసింది.

T20 లలో అత్యధిక పరుగులు చేసి ఆరో స్థానంలో నిలిచింది. సుజీ బేట్స్, స్టాఫానీ టేలర్, షార్లెట్ ఎడ్వర్డ్స్, మెగ్ లాన్నింగ్ మరి డియాండ్రా డాటిన్ తో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక భారతీయురాలు. టి 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా కనిపించిన వారి జాబితాలో ఆమె 21వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ (96) మాత్రమే భారత్ తరపున ఎక్కువ సార్లు ఆడారు.

ప్రధాన కోచ్‌లో మార్పు ఉన్నప్పటికీ గత ఏడాది కాలంగా జట్టు యాజమాన్యానికి అనుకూలంగా లేని రాజ్, వారం క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్‌‌లో ఆడింది. 2021 వన్డే ప్రపంచ కప్ కోసం తనను తాను సన్నద్ధం చేసుకోవడానికి పూర్తి శక్తిని వినియోగించదలచుకుంది. అందుకే టీ 20 నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది మిథాలీ రాజ్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *