అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం: కోహ్లీ

అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం: కోహ్లీ

ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడుతోన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. అయితే తమ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతారని, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు కోహ్లీ చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పేసర్ షమీని ఆడిస్తారని భావించినప్పటకీ... మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లు కీరోల్ పోషిస్తుండడంతో కోహ్లీ చాహల్, కుల్‌దీప్‌లవైపై మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అటు ఆస్ట్రేలియా కూడా విండీస్‌పై ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.

తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియాకు ఈ మ్యాచ్ సవాల్‌గానే చెప్పాలి. ప్రపంచకప్‌ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆసీస్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేం. గత మ్యాచ్‌లో విండీస్‌పై తడబడినా... తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఆసీస్‌కు స్మిత్, వార్నర్‌ , మాక్స్‌వెల్ కీలకంగా ఉన్నారు. అటు బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్, కమ్మిన్స్‌పై అంచనాలున్నాయి. అటు రికార్డులు మాత్రం ఆసీస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడితే ఆసీస్ 8 సార్లు విజయం సాధించగా... భారత్ మూడు మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుత ఫామ్‌, బలాబలాల పరంగా ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story