వరల్డ్‌ కప్‌ను ఘనంగా ప్రారంభించిన ఆసీస్‌

వరల్డ్‌ కప్‌ను ఘనంగా ప్రారంభించిన ఆసీస్‌

వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఫించ్‌, వార్నర్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులతో శుభారంభాన్ని అందించారు. మొదట ఫించ్‌ ఔటవ్వగా ఉస్మాన్‌ ఖవాజా15, స్టీవ్‌స్మిత్‌ 18తో కలిసి వార్నర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. 205 పరుగుల దగ్గర స్మిత్‌ ఔటయ్యాక మాక్స్‌వెల్‌ వచ్చి బౌండరీతో ఆసిస్‌కు విజయాన్నందించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో మజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, గుల్బాడిన్‌నైబ్‌, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు అఫ్గానిస్థాన్‌ 207 పరుగులకే ఆలౌటైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మత్‌షా 43, కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌ 31, నజీబుల్లా జద్రాన్‌ 51 పరుగులు చేశారు. కాగా ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, ఆడం జంపా మూడేసి వికెట్లు తీయగా, స్టోయినిస్‌ రెండు, మిచెల్‌ స్టార్క్‌ ఒక వికెట్‌ తీశారు.

Tags

Read MoreRead Less
Next Story