సచిన్‌ రికార్డుకు మరో ఆరు సెంచరీల దూరంలో కోహ్లి..

సచిన్‌ రికార్డుకు మరో ఆరు సెంచరీల దూరంలో కోహ్లి..

వెస్టిండీస్‌తో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు మూడో వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు వన్డేల్లోనూ విరాట్‌ కోహ్లి సెంచరీలతో దుమ్మురేపి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ దశాబ్ద కాలంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించి సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు. సచిన్‌ వన్డేల్లో 49 సెంచరీలు చేయగా... ఆ మార్కును చేరడానికి కోహ్లి మరో ఆరు సెంచరీల దూరంలో నిలిచాడు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story