అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా..!

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు పాల్గొన్నారు.

అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా అన్నట్టు శ్రీదేవి విగ్రహాన్ని రూపొందించారు. బంగారు రంగు వస్త్రాలు ధరించి, తలపై కిరీటంతో తయారు చేసిన మైనపు బొమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. 1987లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్‌ చిత్రం మిస్టర్‌ ఇండియాలోని హవా హవాయి లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు కన్నుమూశారు. దీంతో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రకటించింది. దీని ప్రకారమే శ్రీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఈ గుడిలో దేవుడు లేడు.. ఉన్నది బొమ్మే.. - యాదాద్రి ప్రధానార్చకులు

Wed Sep 4 , 2019
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకులు నరసింహాచార్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుట్ట కింద రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక చిన్న గుడి తొలగింపు వివాదానికి కారణమైంది. మంగళవారం దీనికి సంబంధించిన పూజలు చేశాక, ఆలయ తొలగింపు పనులు ప్రారంభించారు అధికారులు. ఐతే.. స్థానికులు కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులుతో వాగ్వాదం జరిగింది. ఉన్నది చిన్న గుడి అయినా.. పెద్ద గుడైనా.. దేవుడే కదా..? అని […]