సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 8 వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 29న ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నట్టు టీటీడీ తెలిపింది. 30న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9నుంచి 11గంటల వరకు, రాత్రి 8నుంచి 10గంటల వరకు స్వామి వాహనసేవలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధిలో భాగంగా సెప్టెంబర్ 24న కోయిల్‌ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు,

30న పెద్దశేష వాహనం, 1న చిన్నశేష వాహనం, హంస వాహనము,,2న సింహవాహనమ, ముత్యపు పందిరి వాహనం.3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 4న మోహిని అవతారం, గరుడ వాహనం..5న హనుమంత వాహనం, గజ వాహనం..6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం 7. స్వర్ణ రథం,అశ్వ వాహనంపై స్వామి మాడ వీధుల్లో ఊరేగారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి : ఎంపీ కోమటిరెడ్డి

Sun Jul 28 , 2019
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్నారు. పీవీఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు జైపాల్ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీభవన్ కు ఆయన పార్ధీవ దేహం చేరుకుంటుంది. పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానుల ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం గాంధీభనవ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు తరలిస్తారు. […]