కాలేజ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్‌ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన లహరి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి ఇటీవలే కాలేజ్‌కు వచ్చింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చిన కాసేపటికే లహరి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది.

లహరి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజ్‌లో ఏమైనా ఇబ్బందులున్నాయా లేదా కుటుంబకలహాలే కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. లహరి క్లాస్‌మేట్స్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ఇంటి నుంచి వచ్చిందని.. ఇంతలో ఏమైందో తెలియదని స్నేహితులు చెబుతున్నారు.

TV5 News

Next Post

బూటు కాలుతో తంతూ యువకులను హింసించిన..

Tue Oct 15 , 2019
బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై ఓ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ రాక్షసంగా ప్రవర్తించాడు. బూటు కాలుతో తంతూ యువకులను దారుణంగా హింసించాడు సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ సలీం ఖాన్‌. బాధితులు వద్దని వేడుకున్నా కనికరించలేదు. ఆర్తనాదాలు పెడుతున్నా విన్లేదు. మరింత కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ ఫోర్స్ ఎండీ.. ఎందుకంత రాక్షశంగా వ్యవహరించాడు. ఆ యువకులు ఎవరనే కోణంలో […]