ముగ్గురు టెన్త్ స్టూడెంట్స్ మిస్సింగ్

చిత్తూరు నగరంలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లినవారు ఇంటికి తిరిగిరాలేదు. వారంతా అసలు స్కూలుకే వెళ్లలేదని తెలుసుకుని పేరెంట్స్ షాకయ్యారు. పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వి.కౌసల్య, ఎ.ఢిల్లీబాబు, ఆర్‌.సౌమ్య.. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్. వీరంతా గిరింపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. దసరా సెలవుల తర్వాత వీరంతా గురువారం ఉదయమే ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి విచారించారు. అసలు స్కూలుకే రాలేదని తెలియడంతో వారి కోసం చాలా చోట్లా వెదికినా ఆచూకీ దొరకలేదు. ఇక మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TV5 News

Next Post

ఈఎస్ఐ స్కామ్‌లో మరో ముగ్గురు అరెస్ట్

Fri Oct 11 , 2019
సంచలనం సృష్టించిన ESI మెడిసిన్స్ స్కామ్‌లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న పాషాను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అవసరం లేకున్నా పెద్ద మొత్తంలో మెడిసిన్స్ కొనుగోలు చేసి.. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారన్నది వీరిపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ కేసులో ఇప్పటికే ESI డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని అరెస్ట్ […]