రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఆత్మహత్యాయత్నం

sucide

కొన్నేళ్లుగా తన భూ సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించడంలేదని ఓ వ్యక్తి విసుగు చెందాడు. తీవ్ర ఆవేదనతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి గాండ్లపెంట మండల కేంద్రంలో జరిగింది.

తుమ్మలబైలు గ్రామానికి చెందిన సురేంద్రనాయక్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ.. కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న రెవెన్యూ సిబ్బంది, స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. భూమికి సంబంధించి కోర్టు కేసు ఉందని, అది తేలే వరకు వేచి ఉండాలని అధికారులు చెప్పడంతో సురేంద్రనాయక్‌ శాంతించాడు.

TV5 News

Next Post

న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం : సున్నీ వక్ఫ్‌ బోర్డు

Sat Nov 9 , 2019
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు సుదీర్ఘమైన తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్టుకు అప్పగించాలని స్పష్టంచేసింది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు తెలిపింది. తీర్పు కాపీ అందిన తర్వాత.. దానిపై చర్చించి.. రివ్యూ పిటిషన్‌ వేయాలో, వద్దో నిర్ణయం తీసుకుంటామని బోర్డు తరఫు న్యాయవాది జిలానీ తెలిపారు. అయితే.. రివ్యూ పిటిషన్‌ అవసరం లేదనే నిర్ణయానికి సున్నీ వక్ఫ్‌ బోర్డు వచ్చినట్టు సమాచారం.