నన్ను వదిలి నీవు పోలేవులే.. సుధీర్‌‌తో రష్మి..

సుడిగాలి సుధీర్ బుల్లి తెరపై రష్మీతో చేసే సందడి ప్రేక్షకులకు ఓ విందు భోజనం లాంటిది. కామెడీ, రోమాన్స్ కలగలిపి ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది ఈ జంట. నిజంగా వాళ్లిద్దరి మధ్య లవ్ ఉందా.. లేక అదంతా వట్టిదేనా అనేది అసలు అర్థం కానివ్వరు. సుధీర్ నోటివెంట రొటీన్‌గా వినిపించే డైలాగ్.. రష్మీ.. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ.. నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ అంటాడు. అప్పుడే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అనిపిస్తుంది చూసే ప్రేక్షకుడికి. ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టని డైలాగ్ కూడా ఇదేనేమో.

బుల్లితెరపై వస్తున్న ఓ షో ఫైనల్స్ కోసం ఈ జంట చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత వారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మెడ్లీ చేసారు వీరిద్దరూ. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వీరి డ్యాన్సులో కామెడీ కూడా మిళితమై ఉండడంతో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 1970లలో వచ్చిన పాట నన్ను వదిలి నీవు పోలేవులే.. 80ల్లో వచ్చిన ఎల్లువొచ్చి గోదారమ్మ.. 90 ల్లో వచ్చిన మామా మామా అంటూ ఈ జంట బుల్లితెరపై చేసిన సందడికి ప్రేక్షకులు మైమరచి పోయారు. బుల్లితెర బెస్ట్ కపుల్ అనిపించుకున్న వీరిరువురు వెండి తెరపై కూడా సందడి చేస్తే అభిమానుల సంఖ్య పెరిగిపోతుందనడంలో ఆశ్చర్యంలేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీ వర్షాలు.. మహానంది ఆలయంలోకి వరద నీరు

Tue Sep 17 , 2019
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నంద్యాల డివిజన్‌ పరిధిలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. నల్లమల అటవీ పరిధిలో వరదలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, మద్దెలవాగు, నిప్పులు వాగుల్లోకి విపరీతంగా వరదనీరు వచ్చి చేరుతోంది. చామ కాలువ ద్వారా కుందూ నదిలో వరదనీరు చేరడంతో ప్రవాహం ఉధృతంగా ఉంది. భారీ వర్షాలకు మహానంది ఆలయంలోకి వరద నీరు చేరి కోనేరు నీట మునిగింది. చాలా చోట్ల పంట పొలాలు […]