రష్మీని సుధీర్ చెల్లెమ్మా అని..

బుల్లితెరపై సుధీర్, రష్మీల జోడీ చూస్తే అభిమానులకు పండగే. వారు చేసే చిలిపి అల్లరి, ఆకట్టుకునే డ్యాన్స్ ఫెర్మామెన్స్, వారిమధ్య కెమిస్ట్రీ, ఒకరిపై ఒకరు చేసుకునే కామెంట్లు.. అన్నీ హైలెట్టే. వీరిద్దరు ప్రధాన పాత్రధారులుగా సాగుతున్న బుల్లి తెర షో లు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. వీరి లవ్‌ట్రాక్ ప్రధాన హైలెట్‌గా కొనసాగుతుంటుంది. ఈ నెల 27న ప్రసారం కాబోయే జబర్దస్త్‌షోలో రష్మీ, సుధీర్‌ల జోడీపై షూట్ చేసిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్కిట్‌లో భాగంగా కాలేజీ ఆడపిల్లలను ర్యాగింగ్ చేస్తుంటాడు సుధీర్.

అంతలో చమ్మక్ చంద్ర రంగంలోకి దిగి రష్మీని చెల్లెమ్మా అని పిలువ్ అని అంటాడు. దాంతో సుధీర్ ఫీలింగ్స్ మారిపోతాయి. అది చూసి రష్మీ నవ్వాపుకోలేకపోతుంది. జడ్డిగా వ్యవహరిస్తున్న నాగబాబు సైతం పగలబడి నవుతుంటారు. సార్ ఆ ఒక్కావిడను మాత్రం నాకొదిలేయండి సార్ అని సుధీర్ అనడం హైలెట్. సుధీర్, రష్మీల జోడీని క్యాష్ చేసుకుంటూ ఇలాంటి స్కిట్లను రూపొందిస్తుంటారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులకు కూడా అవే నచ్చుతుంటాయి. ఆ మధ్య జరిగిన ఓ షోలో బుల్లి తెర వేదికపై రష్మీ, సుధీర్‌ల పెళ్లి కూడా చేసేసారు. అది ఎంత పాపులరైందో అందరికీ తెలిసిందే.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

శివప్రసాద్‌ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Sat Sep 21 , 2019
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివప్రసాద్‌ మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు అన్నారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా శివప్రసాద్‌ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపోయారన్నారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసం..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ ముందు వినూత్న రీతిలో ఆయన తెలిపిన నిరసన కార్యక్రమాలు ప్రజలు మరిచిపోలేరన్నారు. చిత్తూరు ఎంపీగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శివప్రసాద్‌ […]