చాయ్‌లో, జ్యూస్‌లో చక్కెర వేసుకుని తాగేస్తున్నారా.. అయితే..

చక్కెర వేసుకున్న చాయ్ తాగితే అప్పటికి బావుంటుందేమో కాని అస్సలు మంచిది కాదంటున్నారు ప్రజల ఆరోగ్య పరిస్థితులపై పరిశోధనలు చేసిన పరిశోధకులు. ఇక పండ్ల రసంలో కూడా సహజ సిద్ధంగానే కొద్దిగా చక్కెర ఉంటుంది. దానికి మనం కూడా మరికొంత చక్కెర జోడిస్తే జ్యూస్ తాగిన ఉపయోగం లేకపోగా అనర్థాలకు దారి తీస్తుందని అంటున్నారు. చల్లగా, తియ్యగా ఉండే జ్యూస్ కడుపులో పడగానే ఎక్కడలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది కానీ ఇలా చక్కెర వేసుకుని జ్యూస్ తాగితే ఉపయోగం లేదంటున్నారు.
జ్యూస్‌గా కంటే పండుని ముక్కలుగా తీసుకుంటేనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని ముందునుంచి వైద్యులు చెబుతూనే ఉంటారు. చక్కెర జ్యూస్ తాగినా, చాయ్‌లో చక్కెర వేసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫ్రాన్స్ వైద్యులు తెలియజేస్తున్నారు. దాదాపు లక్ష మంది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఈ బృందం రోజూ చక్కెర కలిపిన పానీయాలు పుచ్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని అంటున్నారు. అయితే వయసును బట్టి చక్కెర పాళ్లను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. కోకా కోలా డ్రింక్ కన్నా కప్పు చక్కిర కలిపిన చాయ్ ప్రమాదమట. బ్రిటన్ పిల్లలు మోతాదుకు మించి చక్కెర తీసుకుంటున్నారని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్’ ఆందోళన చెందుతోంది. ఇక బాటిల్స్, కంటెైనర్స్‌లో దొరికే పళ్ల రసాలు మనం ఇంట్లో చేసుకునే పళ్ల రసాల కంటే మరింత ప్రమాదకరమైనవని అంటున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాళ్లను నియంత్రించాల్సి ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. పారిస్‌లోని సార్బోన్, ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిపుణులు సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు.
చక్కెర బదులు బెల్లం వాడితే శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. అయిన ఒకటీ రెండు కప్పులకు మించి చాయ్ తాగకపోవడమే మంచిది. ఆరోగ్యం పాడై అసలుకే వద్దని డాక్టర్లు చెప్పేదాకా తెచ్చుకునే కంటే ముందు నుంచి కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మనకే మంచిది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

డ్రైవర్ నిద్రమత్తులో.. 9 మంది ప్రాణాలు గాల్లో..

Thu Jul 18 , 2019
తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లకుర్చి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బససు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణీకులతో కోయంబత్తూరు నుంచి బస్సు చెన్నై వెళ్తోంది. అదే సమయంలో 14 మంది కార్మికులతో మినీ వ్యాన్ ఉతిరమెరూర్ నుంచి కంగెయాం వైపు వస్తోంది. వ్యాన్ అదుపుతప్పడంతో అన్నానగర్ ఫ్లైఓవర్ వద్ద […]