జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు: సుజనా చౌదరి

suj

వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెరూసలేం వెళ్లేందుకు.. ఆర్థిక సాయం పెంచిన జగన్.. బద్రినాథ్, కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు సాయం చేయాలని.. హిందువులు కోరితే ఏం చేస్తారని నిలదీశారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు, ఓట్ల మూడ్ లోంచి బయటకు వచ్చి పాలనపై ఫోకస్ చేయాలని సూచించారు సుజనా చౌదరి.

TV5 News

Next Post

అయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుంది - అమిత్ షా

Thu Nov 21 , 2019
అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్వరలోనే రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. లేత్‌ హార్‌లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయోధ్య వ్యవహారం-రామాలయ నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి చుట్టూనే అమిత్ షా ప్రచారం కొనసాగింది. జార్ఖండ్‌ నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడంలో ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ చేసిన కృషి అసామాన్యమైనదని అమిత్ షా […]