కాలితో షేక్‌హ్యాండ్ ఇచ్చిన ఆర్టిస్ట్‌ని చూసి సూపర్ స్టార్‌..

rajani

దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి అన్ని అవయవాలు ఇచ్చినందుకు.. ఎవరి మీదా ఆధారపడకుండా చేసినందుకు. అయినా ఏమీ చేయలేపోతున్నామని ఆవేదన.. అదృష్టం లేదేమోనని సరిపెట్టుకోవడం.. మరో ప్రయత్నంలో విజయం నీదే అని మనసు చెబుతున్నా.. మనసు మాట వినకుండా మానవ ప్రయత్నం చేయకుండా.. దేవుడి మీదే భారం వేయడం.. పుట్టుకతోనే చేతులు లేవు.. అమ్మా నాన్న బాధపడ్డారు. అయినా కన్నబిడ్డని కటికి రెప్పలా కాపాడుకున్నారు. విద్యాబుద్దులు నేర్పించారు. చేతులుంటేనే చేయి తిరగని విద్య.. చిత్ర కళను నేర్చుకున్నాడు. కాళ్లతో అద్భుతమైన చిత్రాలు గీస్తూ వైకల్యం మనసుకే కానీ మనిషికి కాదని నిరూపించాడు కేరళ పాలఘాట్‌కు చెందిన ప్రణవ్. తన పెయింటింగ్‌లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కేరళలో వరదలు సంభవించిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇచ్చాడు. దీంతో సీఎం పునరయి విజయన్ నుంచి పిలుపు అందుకున్నాడు. ప్రణవ్ కాలితోనే సీఎంకి షేక్ హ్యాండ్ ఇస్తూ సెల్ఫీ దిగాడు. దీంతో ప్రణవ్ పేరు మీడియాలో మారుమోగిపోతోంది. తాజాగా అతడికి సూపర్ స్టార్ రజనీకాంత్ ‌నుంచి పిలుపు వచ్చింది. ప్రణవ్‌ను పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటికి రజినీ ఆహ్వానించారు. అతడు కేరళ నుంచి చెన్నై వచ్చేందుకు రజినీనే ఏర్పాట్లు చేశారు. రజినీ పెయింటింగ్‌ని వేసి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు ప్రణవ్.

rajani-1

ప్రస్తుతం ప్రణవ్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

rajani-2

 

 

TV5 News

Next Post

డిస్కౌంట్‌ పేరుతో ఘరానా మోసం

Tue Dec 3 , 2019
వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజా ట్రేడర్స్‌-ఆర్డర్‌ సప్లయర్‌ పేరుతో జనాలకు కొందరు వ్యాపారులు కుచ్చుటోపి పెట్టారు. ఎలక్ట్రానిక్‌, ఫర్నిచర్‌ వస్తువుల, మొబైల్ ఫోన్లపై 40 శాతం.. డిస్కౌంట్‌ ఇప్పిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఇలా దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన తరువాత బోర్టు తిప్పేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు.. షాపు ముందు నిరసనకు దిగారు.