విజయారెడ్డి హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ భార్య లత

suresh

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సురేష్ భార్య లత.. సంచలన అంశాలు వెల్లడించింది. చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో.. భార్యతో మాట్లాడిన సురేష్ పలు కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త తహసీల్దార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్లలేదని.. ఆత్మహత్యాయ్నం చేసి భయపెట్టాలనుకున్నాడని తెలిపింది. అయినా.. విజయారెడ్డి వినకపోవడంతో ఆమెనూ చంపాలనుకున్నాడని వెల్లడించింది. తన భర్త లాంటి చావు మరే రైతుకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. భూముల వ్యవహారంలో సురేష్ లక్ష రూపాయలు అప్పుచేశాడని అవి ఎవరికి ఇచ్చాడో తెలియదని లత చెబుతోంది.

TV5 News

Next Post

బ్యాంకు ఉద్యోగి సాయంతో పాత కరెన్సీ మార్చే ప్రయత్నం

Fri Nov 8 , 2019
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా పాత కరెన్సీ పట్టుబడడం కలకలం రేపింది. నోట్లు మార్చేందుకు హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.9 లక్షల 95వేల నగదును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు సామ్యేల్, కపిల్, ఇంతియాజ్‌లలో ఒకరు బ్యాంకు ఉద్యోగిగా ఉన్నట్టు భావిస్తున్నారు.