చిన్నారి అనుమానాస్పద మృతి

BABY

చిత్తూరు జిల్లా కురబాల కోటలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిణి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్వాణమండపంలో సరదాగా ఆడుకుంటూ కనిపించిన వర్షిణి అర్థరాత్రి కనిపించకుండా పోయింది. తెల్లవార్లూ వెతికినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. ఉదయం కళ్యాణమండపం సమీపంలోనే వర్షిణి విగతజీవిగా పడి ఉంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

TV5 News

Next Post

వివాహిత వికృత చేష్టలకు భర్త బలి..

Fri Nov 8 , 2019
ఒంగోలు పట్టణంలోని మారుతీనగర్‌లో ఏడుకొండలు అనే ఆటోడ్రైవర్‌ రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య అసహజ శృంగార కోరికలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఏడుకొండలు భార్య కాలేజీ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేది. ఆన్‌లైన్‌లో సెక్స్ టాయ్స్‌ కొని బాలికలతో అసహజ శృంగారం చేసేదని పోలీసులు తెలిపారు. దీనిపై ఓ బాలిక స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏడుకొండలు ఇంటికివెళ్లిన పోలీసులకు […]