బాక్సాఫీస్ వద్ద సైరా హవా.. ఐదు రోజుల్లో..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి, తొలి రోజు 85 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా వీకెండ్ మూడు రోజులు శుక్ర, శని, ఆది వారాల్లో టాప్ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. మొదటి ఐదు రోజుల్లో సైరా నరసింహారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

బ్రిటీష్ వారిపై తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ గ్రాండ్ గా నిర్మించడం, సురేందర్ రెడ్డి టేకింగ్, చిరంజీవి, తమన్నా, అమితాబ్, సుదీప్ ల నటన సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ కి ధియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఊహించినదానికంటే ఎక్కువే వస్తున్నాయి. అలాగే ఓవర్సీస్ లో ఆల్ రెడీ 2 మిలియన్ క్లబ్ లో చేరింది సైరా. ఇక మొదటి ఐదు రోజుల్లో 175 కోట్లు రాబట్టిందంటే, మరో రెండు రోజుల్లో 200ల కోట్లు గ్రాస్ మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది ఈ సినిమా.

TV5 News

Next Post

ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి పండుగ సెలవు

Mon Oct 7 , 2019
ప్రభుత్వ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. జేఏసీ ముఖ్య నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా మంగళవారం ఉద్యమానికి సెలవు ప్రకటించారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరు శమీ పూజ చేస్తారని.. అందుకోసమే విరామం ఇస్తున్నట్టు తెలిపారు. తదుపరి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై బుధవారం నిర్ణయం తీసకుంటామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.