‘సైరా’ నరసింహారెడ్డి.. ఐదురోజుల కలెక్షన్స్ చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం ‘సైరా’ నరసింహారెడ్డి. ఈ సినిమా మొదటిరోజునుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పైగా దసరా సెలవులు తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతూ.. ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఒక్క ఐదోరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కేవలం ఐదురోజుల్లోనే రూ.175 కోట్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లు రాబట్టిన ‘సైరా’ తొలిరోజు నుంచే తన హవా చూపెట్టింది. నైజాంలో 20 కోట్లకు పైగా షేర్ అందుకుంది.. ఆంధ్రాలో కూడా 50 కోట్ల మైలురాయిని అందుకున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఇక మిగిలిన భాషల్లో కూడా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తమిళనాడులో ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రాలేదు.. కానీ కన్నడలో మాత్రం జూలు విదిల్చింది. యూఎస్ లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లకు పైగానే రాబట్టింది.

TV5 News

Next Post

మోదీ, జిన్‌పింగ్ భేటీకి వేదికగా శోర్.. ఆలయ చరిత్ర ఇదే..

Tue Oct 8 , 2019
దేశాధినేతల సమావేశాలు, భేటీలూ అధికారిక నివాసాల్లో జరిగడం అనావాయితీ. అయితే మోదీ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. చారిత్రక కట్టడాలను ద్వైపాక్షిక చర్చలకు వేదికలుగా మార్చారు. భారతదేశ చరిత్రను తెలియజేయడంతో పాటు… ప్రపంచదేశాల దృష్టిని కూడా ఆకర్శించి పర్యాటక క్షేత్రాలుగా మారతాయన్న ఆలోచన ఇందుకు కారణమా? త్వరలో చైనా అధ్యక్షుడితో భేటికి కూడా తమిళనాడులోని పురాతన ఆలయాన్ని మోదీ ఎంపికచేయడం విశేషం. ఐతే… ఈ భేటీని తమిళనాడులోని మమలియాపురంలో ఉన్న చారిత్రక […]