amaravati

గవర్నర్‌ను కలిసిన అమరావతి మహిళలు

రాజధాని అమరావతి ప్రాంత మహిళలు గవర్నర్‌ను కలిసారు. తాము శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతుంటే.. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టులు, దాడుల అంశాల్ని బిశ్వభూషణ్‌కు వివరించారు. ఈ వ్యవహారంలో రాజ్‌భవన్ జోక్యం చేసుకోవాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరారు.

రాజధాని ఇంచు కూడా కదలదని మరోసారి స్పష్టం చేసిన సుజనాచౌదరి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిపై సీఎం జగన్ తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే.. చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అమరావతి తరలింపుపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని అన్నారాయన. ఆ సమయం ఇంకా రాలేదన్నారు. విభజన చట్టంలో రాజధానిపై చాలా స్పష్టంగా ఉందని సుజనా చౌదరి గుర్తుచేశారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే.. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని సుజనా చౌదరి […]

తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ

  రాజధాని గ్రామాల్లో 32వ రోజు నిరసనలు హోరెత్తుతున్నాయి. తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని.. తమకు భూములు అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. తుళ్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి CRDA ఆఫీస్ వరకూ ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళలు ర్యాలీ చేపట్టారు. మరోవైపు రాజధాని […]

అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యజ్ఞం

రాజధానిగా అమరావతి కోసం.. శ్రీపాసుపథ సంపుటీకరణ మహా కాలభైరవ యజ్ఞాన్ని నిర్వహించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. శాస్త్రోస్తంగా పూజా కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ యజ్ఞం జరుగుతుంది. అలాగే 29 గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాల వద్ద హోమాలు నిర్వహిస్తామని శివస్వామి తెలిపారు.

ముప్పాళ్ల నాగేశ్వర్ రావుకు పోలీసుల నోటీసులు

ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి విపక్షాలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపక్ష నాయకులకు నోటీసులు అందిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వర్‌రావు నోటీసులు అందుకున్నారు.

జనసేన-బీజేపీ కలయిక కీలక పరిణామం: పయ్యావుల కేశవ్

రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌. జనసేన-బీజేపీ కలయిక కీలక పరిణామమన్నారు. ఆ రెండు పార్టీలు రాజధాని కోసం ఏం చేస్తాయని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ తలుచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి చాలా చిన్నదని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. అమరావతిపై బీజేపీ నిర్ణయాన్ని బట్టి ఏపీలో వారి రాజకీయ […]

15 మంది రైతులు చనిపోతే స్పందించని పోలీసులు.. ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలితే స్పందించారు: లోకేష్

  అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని.. 5 కోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. నాడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ ఇప్పుడు మాట తప్పారని అన్నారు. అమరావతిలో అన్ని సౌకర్యాలు సమకూరినప్పటికీ.. 3 రాజధానుల పేరుతో జగన్ రాస్ట్రంలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధానిని ఎలా నిర్మించాలో తెలుసని.. సైబరాబాద్ ను […]

బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

రాజధాని గ్రామాలు 31 రోజులుగా అట్టుడుకుతున్నాయి. సంక్రాంతి కూడా జరుపుకోకుండా ప్రజలు దీక్షలకే పరిమితమయ్యారు. పోలీసుల దమనకాండ, లాఠీఛార్జ్‌నూ లెక్కచేయలేదు. రక్తం చిందినా జై అమరావతి నినాదం మానలేదు. అక్కడ అంత సీరియస్‌గా, ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బాధను, ఆవేదనను పెద్దగా చెవికెక్కించుకున్నట్లు కనపడంటం లేదు. హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స […]

అమరావతిలో అసెంబ్లీ తాత్కాలికమని గతంలో చంద్రబాబు అన్నారు: బొత్స

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది హైపవర్‌ కమిటీ. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు హైపర్‌ కమిటీ సభ్యులు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలపైనే అధికంగా చర్చించారు. సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు. […]

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎందుకు నిరూపించలేకపోతున్నారు: లోకేష్

రాజధాని తరలింపును ఒప్పుకునేది లేదన్నారు మాజీ మంత్రి లోకేష్‌. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో సీతారామ ఆలయం జంక్షన్‌ నుంచి అంబేడ్కర్ సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో […]