రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా టీవీ 5 రిపోర్టర్‌ తాతాజీ కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం అందచేయనున్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆయన్ను జర్నలిస్టుల ప్రతినిధుల బృందం కలిసింది. ప్రమాదబీమా పథకం రెన్యూవల్‌ కానందున తాతాజీ కుటుంబానికి ఎదురైన సమస్యను వివరించింది. ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కోరారు జర్నలిస్టు సంఘం నేతలు. దీనిపై సానుకూలంగా స్పందించిన […]

ఏపీ ప్రభుత్వం ఐపీ పెట్టినట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు ఏపీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి. నెలలు తరబడి వేతనాలు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయినా ప్రభుత్వం వాటిగురించి ఆలోచించడం లేదని విమర్శించారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఉద్యోగులపై స్థానిక వైసీపీ నేతల బెదిరింపులు పెరిగాయని ఆరోపించారు..

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణమివ్వరాదన్న ప్రపంచ బ్యాంకు నిర్ణయం బాటలోనే మరో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ కూడా నడిచింది. తాము కూడా అప్పు ఇవ్వబోవడం లేదని ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఏఐఐబీ.. చైనా ఆర్థిక సహాయంతో నడిచే సంస్థ. ప్రపంచ బ్యాంక్‌తో కలసి రాజధానికి రుణమిచ్చే విషయాన్ని గత కొంతకాలంగా ఇది చురుగ్గా పరిశీలిస్తోంది. అయితే ఇటీవల ప్రపంచ […]