ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రవాసాంధ్రులు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమర జీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావుతోపాటు పలువురు తెలుగువారు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు త్యాగం పలితంగా భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు గుర్తుచేశారు. అమెరికాలోను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఏపీలో ప్రజాపాలనపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత నివారించడంలో వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఏర్పడిందని సుజనా అన్నారు.

తెలుగు రాష్ట్రాలపై స్వైన్‌ ఫ్లూ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుతుండడంతో స్వైన్‌ ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గత 6వారాల్లోనే 28 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే ప్ల్యూ స్వైరవిహారం ఏరేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1325 […]

కూరగాయలకంటే రేటు ఎక్కువ పెరిగి 15 రోజులుగా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిపాయలు.. హైదరాబాద్‌లో అయితే కిలో రూ.60ల నుంచి ఆపై మాటే. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఏపీ ప్రజలకు కిలో రూ.25లకే ఉల్లిని అందిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. మహారాష్ట్ర నుంచి 300ల టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని ఆయన […]

ఏపీలోని నిరుద్యోగ యువతకు 6 ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NFDC) ముందుకొచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌తో కలిసి ఈ సంస్ధ పనిచేయనుంది. శిక్షణలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులకు యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, అసిస్టెంట్ కెమెరామెన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కోర్సుకు 30 మందిని […]

ఏపీలో పోలవరం రివర్స్‌ టెండరింంగ్‌ ‌ రాజకీయంగా హీట్‌ను పెంచుతోంది. దీనిపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మరోవైపు రివర్స్ టెండరింగ్‌ రాష్ట్రానికి మంచిది కాదన్న టీడీపీ ..పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే చేపట్టాలని డిమాండ్‌ చేసింది. అటు బీజేపీ సైతం.. రివర్స్ టెండరింగ్‌ను వ్యతిరేకించింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్‌ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ టెండర్లను రద్దు చేసిన వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలకు గురవుతోంది. దీనిపై […]

బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం బెంగాల్‌లో దిఘాకు దక్షిణ ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మధ్యాహ్నానికి బాలాసోర్‌ దగ్గర తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో […]

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరద గోదావరి ఊళ్లను ముంచెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ముంపుకు గురైన దేవీపట్నం 32 గ్రామాల ప్రజలను ప్రస్తుతం పునరావస ప్రాంతాలకు అధికారులు తలరించారు. రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న బ్రిడ్జి లంక, కేతవాని లంక గ్రామాల వాసులను రాజమహేంద్రవరంకు తరలించారు. ధవళేశ్వరం దిగువన కోనసీమ లంక గ్రామాలు ముంపు ముంగిట్లో ఉండడంతో ఆయా లంక గ్రామాల ప్రజలను తరలించేందుకు […]

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోను వానలు కురుస్తుండడంతో గోదావరి, కృష్ణా నదులు జలకళ సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో.. మరో రెండ్రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడం రైతుల్లో కొత్త ఆశలు చిగురింప చేశాయి.ఏపీ, తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ముఖ్యంగా గోదావరి […]

ఏపీలో సూపర్ న్యూమరీ డీఎస్పీ పోస్టులు పొందిన పోలీసుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. సూపర్ పోలీస్ తరహాలో హడావుడి ప్రమోషన్ లు ఇచ్చిన ప్రభుత్వం..వారిని ఇంకా రెగ్యులర్ చేయకపోవటంతో ఆయోమయంలో పడ్డారు. ఒంటి మీద డీఎస్పీ యూనిఫాం ఉన్నా..సీఐ డ్యూటీలే చేస్తుండటంతో తమకు ప్రమోషన్ వచ్చిందా? రాలేదా? సూపర్ పోలీసులకే అర్దం కావటం లేదు. భవిష్యత్తులో ప్రమోషన్ సమయంలో సర్వీస్ పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. […]