మహారాష్ట్రలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు పార్టీలు వరుస సమావేశాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. కాసేపట్లో సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించి శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయించనున్నారు. అయితే సోనియా నిర్ణయం కోసం పార్టీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే జైపూర్ లోని స్టార్ హోటల్‌ లో క్యాంపులో ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను […]

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని… సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి తాము ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఎప్పుడూ శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి చర్చలు జరిగినా.. దాని విషయం తనకు తెలియదని.. అధ్యక్షుడు అమిత్‌షాకు మాత్రమే పొత్తు గురించి తెలుసన్నారు.

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం అర్దరాత్రితో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేశారు. మరోవైపు.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. బీజేపీ-శివసేన మధ్య డీల్ కుదరలేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి ఏర్పడింది. తొలుత తమకు సీఎం పదవి ఇవ్వాలంటూ శివసైనికులు పట్టు పడుతున్నారు. దీంతో బీజేపీ-శివసేన కూటమి ఏర్పాటుకు అవకశాలు కనిపించటంలేదు. […]

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకపోతే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదన్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపై ఉన్న ప్రేమ.. ఉద్యోగులపై లేదని విమర్శించారు. బీజేపీ నేతలపై దాడులు పెరగడంపైనా లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. త్వరలోనే పార్టీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు లక్ష్మణ్‌ను కలిసి.. […]

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పేదప్రజల ఖాతాల్లో 15 లక్షలు, రైతులకు మద్దతు ధర అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 10 శాతంగా ఉంటే బీజేపీ పాలనలో అది 5 […]

ఏపీలో ప్రజాపాలనపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత నివారించడంలో వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఏర్పడిందని సుజనా అన్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వేగంగా పావులు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షాతో ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. శివసేనతో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పంపకంపై కీలక చర్చలు జరిగాయి. మరోవైపు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై శరద్‌ పవార్ కసరత్తు చేస్తున్నారు. […]

మరాఠా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం పీఠంపై శివసేన పట్టు వీడడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెగేసి చెప్పింది. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని పునరుద్ఘాటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పేసింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో […]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఈ నెల 7లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే.. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందన్న బీజేపీ నేత సుధీర్‌ ముంగంటివర్‌ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. రాష్ట్రపతి పాలన పేరిట బీజేపీ బెదిరింపులకు దిగుతోందా అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. అటు శివసేన అధికారిక పత్రిక సామ్నా సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహరాష్ట్రకు అవమానం, రాష్ట్రపతి మీ […]

దేశంలో టెర్రరిజాన్ని సహించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. 1992లో విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఉగ్రవాదులు కాల్పి చంపారని.. ఆ కేసులో దోషులను వదిలి వేయడం బాధాకరమన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఐపీఎస్‌ కృష్ణ ప్రసాద్‌ కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి పరామర్శించారు.