అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 9రోజులు అయింది. ఇంకా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. సీఎం పదవి మాకంటే మాకని బీజేపీ-శివసేన పార్టీలు దోబూచులాడుతున్నాయి. ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు గడువు ముంచుకొస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితులు చేజారిపోతాయి. చివరకు రాష్ట్రపతి పాలన వస్తుందని నిపుణులంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఏడులోగా ప్రభుత్వం […]

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ పరిణామాల గురించి చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లారు. కార్మికుల సమ్మె దాదాపు నెల రోజులకు చేరిన నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షాను కూడా లక్ష్మణ్‌ కలవనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్రం.. ఈ అంశంపై పార్టీ నేతలతో కూడా మాట్లాడనుంది. ఎంపీ […]

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. జీవో నెంబర్ 2430 కాపీలను టీడీపీ నేతలు తగులబెట్టారు. అటు.. బీజేపీ నాయకులు సైతం.. ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో ప్రకటనతో మహా రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పదవిపై రాజీపడేది లేదంటున్న శివసేన.. తమ పార్టీ వ్యక్తి సీఎం కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేసింది. అంతే కాదు అమిత్‌ షా మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది. బీజేపీకి తాము అల్టిమేటం ఇస్తున్నామన్న వార్తలపై కూడా శివసేన స్పందించింది. ఎవరికి అల్టిమేటం […]

5 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. చిన్న ఇసుక సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ అంటూ ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని సుజనా మండిపడ్డారు. మరోవైపు.. వల్లభనేని వంశీ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. రెండు రోజుల నుంచి […]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శివసేనతో 50:50 డీల్‌కు కమలనాథులు ఏమాత్రం ఆసక్తిగా లేరు. అయితే.. బీజేపీ 13-26 ఫార్ములాను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. శివసేనకు 13 కేబినెట్‌ బెర్తులు ఇస్తామని, తాము అందుకు రెట్టింపు పదవులు తీసుకుంటామని ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం. నవంబర్ 9లోగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నపీస్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నరేంద్రసింగ్‌ తోమర్‌, జాతీయ […]

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నిప్పులు చెరిగారు. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదంటూ మండిపడ్డారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని ఆపేసి.. అభివృద్ధి కుంటుపడేలా చేశారని విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర నెల్లూరులో ముగిసింది.

హర్యానాలో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. మనోహార్‌లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సత్యదేవ్ నారయణ్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలకు గాను… ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 సీట్లు […]

మహారాష్ట్రలో మైనార్టీ సర్కారే కొలువుదీరుతుందా..? అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటిదే జరగొచ్చన్న భావన కలుగుతోంది. ముఖ్యమంత్రి పదవి పంపకం, మంత్రిపదవుల్లో వాటాలపై బీజేపీ-శివసేన మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సొంతగానే ముందుకువెళ్లాలని BJP భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో క్షణక్షణం మారుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. CM పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవడంపై రాతపూర్వకంగా హామీకి శివసేన డిమాండ్ […]

హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య.. మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌తో సీఎంగా ప్రమాణం చేయించనున్నారు. కింగ్‌మేకర్‌ దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈసారి 40 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో 10 సీట్లున్న జన్‌ నాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌లో […]