దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడించాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న కమలనాథులు ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వెళ్తున్నారు.. సౌత్‌లో ఇప్పటికే కర్నాటకలో కమలం వికసించగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.. ముఖ్యంగా ఏపీలో పార్టీ బలోపేతంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ.. ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే ప్రశ్నించడం, ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం ద్వారా బలపడాలని భావిస్తోంది. 2023లో జమిలి ఎన్నికలు వస్తాయని గట్టిగా చెబుతున్న బీజేపీ నేతలు.. […]

యాదాద్రి ఆలయ శిలలపై రాజకీయ గుర్తులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తక్షణం నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు, ఇతర అభ్యంతరకర గుర్తులను తొలగించాలని ఆలయ అధికారులను ఆదేశించింది. మరోవైపు శిలలపై శిల్పాల వివాదం యాదాద్రిలో పొలిటికల్ హీట్ రాజేసింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నేతలు సర్కారుకు వారం రోజుల డెడ్‌లైన్ విధించారు. ఇవాళ కాంగ్రెస్ బృందం ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి రోజంతా […]

మున్సిపల్‌ పోరుకి సై అంటోంది తెలంగాణ బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇత‌ర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ ప్రభావం క‌చ్చితంగా రాబోయే మున్సిపల్‌ ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని భావిస్తున్నారు కమలం పార్టీ నేత‌లు. ఇందుకు అనుగుణంగా ఎన్నికలకు భారీ కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో నాయ‌కులే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ […]

తెలంగాణ‌లో హుజూర్ న‌గ‌ర్ ఉపఎన్నిక‌పై అన్నిపార్టీలు క‌న్నేశాయి. త్వర‌లోనే ఉప‌ ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని భావిస్తున్న పార్టీలు ఈస్థానాన్ని కైవ‌సం చేసుకునేందుకు పావులు క‌దుపుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావ‌డంతో .. ఈ సీటును ద‌క్కించుకునేందుకు టీఆర్ఎస్ సీరియ‌స్‌గా దృష్టి పెడుతోంది. అటు బీజేపీ సైతం బ‌ల‌మైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మ‌రి ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో హ‌స్తం పార్టీ త‌న సిట్టింగ్ సీటును నిల‌బెట్టుకోగ‌ల‌దా ..?.. […]

అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం జరగనున్నాయి. నిగమ్‌ బోధ్‌ శ్మశానవాటిలో అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. జైట్లీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గొప్ప స్నేహితుడి కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు జైట్లీకి నివాళులర్పించారు.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో […]

టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. ఆ పార్టీని విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా అని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. జేపీనడ్డా అధ్యక్షతన ఈ నెల 18న జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పోరాడి సాధించిన తెలంగాణ నలుగురు కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కుటుంబ పాలన నుండి పార్టీని కాపాడుకునేందుకు తాము పోరాడుతామన్నారు. తెలంగాణ నుండి టీడీపీ రాష్ట్ర స్థాయి […]

రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. సంగారెడ్డిలో బీజేపీ కార్యకర్తల మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజ్‌ సందర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల సింగూరు, మంజీరా డ్యామ్‌లు నీళ్లు లేక మైదానాలుగా మారాయన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు దత్తాత్రేయ.

చిన్నమ్మ కన్నుమూశారు.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇక లేరన్న వార్త పార్టీ వర్గాలను షాక్‌కు గురిచేసింది.. రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది.. ఐదుగురు వైద్యులు సుష్మ ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్‌ మరణించారు.. కార్డియాక్‌ అరెస్టు వల్లే ఆమె […]

జమ్ము కశ్మీర్‌పై మోదీ మదిలో ఏముందో స్పష్టత వచ్చింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 370, 35A రద్దుకు కేంద్రం బిల్లు పెట్టింది. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకంటే ముందు.. కశ్మీర్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత ఆజాద్ డిమాండ్ చేశారు. “కశ్మీర్‌ కోసం చాలా మంది రాజకీయ నాయకులు, సైనికులు, ప్రాణాలను […]

కర్నాటక స్పీకర్‌, సీఎంలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా.. సీఎం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విశ్వాసపరీక్ష జరుగుతున్న సమయంలో ప్రభుత్వ అధికారులను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో అవిశ్వాసంపై కాకుండా.. ఇతర విషయాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. వెంటనే స్పీకర్‌ వివ్వాస పరీక్షపై చర్చించి ఓట్‌ ఆఫ్‌ కాన్ఫిడెన్స్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.