కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేయకపోడవంతో గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీ అధినేత అమిత్ షా పర్యటన అందివచ్చిన అవకాశంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీపై ట్వీట్లతో ధ్వజమెత్తారు కేటీఆర్‌. బీజేపీపై విమర్శల జోరు పెంచింది అధికార టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై మోదీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఆర్థిక మంత్రి నిర్మలా […]

వార్షిక బడ్జెట్‌కు ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భాజపా ఎంపీల తొలి సమావేశం ఇదే. బడ్జెట్‌తో పాటు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, పార్టీ అజెండా గురించి ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీని జూన్‌ 25నే నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే, […]

గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సోషల్ వర్కర్‌, సినీ నటుడు కోటి యాదవ్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వినుకొండ ప్రాంతంలో వివిధ పార్టీల్లో ఉన్న తన అభిమానులు, అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరినట్టు కోటి యాదవ్‌ తెలిపారు.

టీడీపీ రాజ్యసభపక్షం బీజేపీలో విలీనంపై రాజకీయ దుమారం రేపుతోంది. విలీన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తోంటే.. అంతా రాజ్యాంగ బద్ధంగానే జరిగిందంటూ కమల దళం కౌంటర్ ఇస్తోంది. గతాన్ని మరిచి టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నలుగురు ఎంపీలు పోయినా.. నాలుగువేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు […]

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏపీలో కమలం వికసిస్తుందా? మారుతున్న సమీకరణాలు దేనికి సంకేతం? కమలం గూటికి నేతలు క్యూ కట్టడానికి కారణమేంటి? హస్తినలో ఏం జరుగుతోంది.? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు […]

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్‌ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. మరో నామినేషన్ కూడా లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. లోక్ సభలో […]

బలాన్ని మరింత పెంచుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.. ఇందులో భాగంగానే వ్యూహకర్త జేపీ నడ్డాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.. బీజేపీలో ఎప్పుడూ కనిపించని, వినిపించని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని నడ్డాకు కట్టబెట్టింది. ఇంతకూ నడ్డా యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోంది..? కొత్త రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు..? ఊహించిందే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు జేపీ నడ్డాకు ప్రమోషన్ లభించింది. నడ్డాను బీజేపీ వర్కింగ్ […]

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా చెప్పిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమాత్రం తగ్గేలా లేరు. ఆయనకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ ఆదేశఇంచగా.. పీసీసీ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గేలా లేరు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ యాక్షన్‌ చూసి… తర్వాత మరోసారి స్పందిస్తానంటూ ఆయన సూటిగా చెప్తున్నారు. బీజేపీలో […]

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కండువా మార్చనున్నారా..? హస్తానికి బైబై చెప్పి.. కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా..? ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా.. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సొంతపార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సైతం రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలోనూ ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి […]

మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇవాళ జరగనుంది. ఈఎక్స్‌పాన్షన్‌ శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతుందని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కూటమి పక్షాలను చల్లబరిచేందుకు కేబినెట్ కూర్పును కసరత్తు చేసింది. శివసేన డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇవాళ కేబినెట్ ఎక్స్‌పాన్షన్‌ జరగనుంది. శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల […]