ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం నిలిచిపోయిందన్నారు. గ్రామ సచివాలయాలకు వాళ్ల పార్టీ కలర్‌ వేశారని, ఇక స్మశానాలకు కూడా పార్టీ రంగులేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుసా.. దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే […]

రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎంపీడీవో సరళ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటికీ సీఎం జగన్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్ల ఆందోళనపై ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. జగన్‌ ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! అంటూ సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ఆశా వర్కర్లకు నెల జీతం 10 వేల రూపాయలకు పెంచేశాం అంటూ ఫోటోలకు పోజులిస్తూ.. మరోవైపు వారిని ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా అంటూ నిలదీశారాయన. ఆశావర్కర్ల కష్టానికి గ్రేడ్‌లు ఏంటంటూ చంద్రబాబు […]

ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. తాను కాస్త జాగ్రత పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది గెలుపుపై అతి విశ్వాసం ప్రదర్శించారన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వాఖ్యలు చేశారు. కార్యకర్తలకు స్పూర్తి నింపడంలో ఫెయిలయ్యామన్నారు. అదే […]