ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు.. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ.. వృద్దులకైతే పింఛన్ పెంచుతామంటారు.. రైతులకైతే రాయితీలు ఇస్తామంటారు. మరి యూత్‌ని ఆకర్షించాలంటే ఉద్యోగాల కల్పనే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉద్యోగం మాట దేవుడెరుగు కానీ ముందు మీకైతే స్మార్ట్ ఫోన్ ఇస్తాం. మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని గత ఎన్నికల్లో పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేసింది. మరి అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. […]

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఓవైపు అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌కు ప‌దును పెడుతూనే .. మ‌రో వైపు గులాబీ స‌ర్కారుపై క్షేత్రస్థాయి పోరాటాల‌కు సిద్ధమవుతోంది. యాక్షన్ ప్లాన్ రెడీ చేసేందుకు భేటీ అయిన పీసీసీ కోర్ క‌మిటీ .. ముఖ్యనేత‌ల అందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో .. తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. […]

రాజధాని తరలింపు ప్రచారం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని మార్చాలనుకోవడం అవివేకమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్ధులపై కోపంతోనో.. లేక సొంత వారి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాజధాని తరలించే కుట్రలకు పాల్పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

తెలంగాణలో తమ పార్టీ ఎదుగుదలను అధికార పార్టీ ఓర్వలేకపోతోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రానున్న రోజుల్లో అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్ లో 370 రద్దు దేశ సమగ్రతకు దోహదపడుతుందన్నారు. పాకిస్తాన్ కు వంత పాడే పార్టీలతో దోస్తీ చేసే వారు దేశభక్తులు ఎలా అవుతారంటూ టీఆర్ ఎస్ ను విమర్శించారు లక్ష్మణ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యుల […]

అసమ్మతి చల్లారడం లేదు. రెబల్‌ ఎమ్మెల్యేలు దారికి రావడం లేదు. మనసు మార్చుకుని సొంత ఇంటికి వచ్చినట్టే వచ్చిన ఎమ్మెల్యేలు..మళ్లీ యూటర్న్‌ తీసుకోవడంతో కర్నాటక సంకీర్ణం మరోసారి గందరగోళంలో పడింది. సినిమా ట్విస్టులను మించి కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఎత్తుకుపై ఎత్తులు, వ్యూహాలకు, ప్రతివ్యూహాలతో కన్నడ పొలిటికల్‌ ఎపిసోడ్‌ రసవత్తరంగా మారింది. అసమ్మతి ఎమ్మెల్యేలు నాగరాజు, సుధాకర్‌ మళ్లీ రెబల్‌ గూటికి చేరడంతో తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్‌, జేడీఎస్‌ […]

కర్ణాటకలో…. రాజకీయ హైడ్రామా మరో మలుపు తిరిగింది. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్‌ నేతలు దిగి రావడం లేదు. కర్ణాటక రాజకీయలు సస్పెన్స్‌ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోనే […]

కర్ణాటకలో…. రాజకీయ హైడ్రామాకు ఇప్పట్లో పుల్‌స్టాప్‌ పడే అవకాశాలు కనిపించడం లేదు. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్‌ నేతలు దిగి రావడం లేదు. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని శనివారం […]

సంక్షోభంలో కాంగ్రెస్ కు ఆశాకిరణం ఎవరు? రాహుల్ రాజీనామా తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే నాయకుడు ఎవరు? నడిపించే నాయకుడు లేక సతమతం అవుతున్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై త్వరలోనే సస్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో కనీసం తాత్కాలిక అధ్యక్షుడినైనా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. గతమెంతో ఘనమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ సిచ్యూవేషన్ ఎంటో తెలియని అయోమయ పరిస్థితిలో […]

వ్యవసాయ రంగ సంక్షోభంపై పార్లమెంటులో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య మాట యుద్ధం జరిగింది. రైతుల ధీన స్థితికి మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు విమర్శలు కుప్పించుకున్నారు. పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్ల రుణమాపీ చేసిన కేంద్రం రైతన్న గురించి పట్టించుకోవడంలేదని రాహుల్ ఆరోపించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలకుల వైఖరి వలనే రైతుల ఆత్మహత్యకు కారణమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై […]

లోక్ సభలో రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది.. రాహుల్ కు ముందు వరుసలో సీటు కేటాయించాలని తామెప్పుడూ కోరలేదని స్పష్టం చేసింది. ఫస్ట్ లైన్ లో సీటు కోసం కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్నదంతా కేవలం ప్రచారమేనని ట్వీట్ చేశారు. లోక్ […]