క్రికెట్ పుట్టిందే ఇంగ్లండ్ గడ్డ‌పై. అయినా ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. 1975 నుంచి మొదలు 2015 వరకు జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో 3 సార్లు ఫైనల్స్ వరకు వెళ్లినా ఇంగ్లండ్ విజేతగా నిలబడలేకపోయింది. ఈసారి ఎలాగైనా కప్ గెలుచుకోవాలన్న కసితో ఆడింది. సొంతగడ్డపైనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్‌లో కివీస్ జట్టును మట్టి కరిపించి […]

ఈసారి ప్రపంచకప్‌ పుట్టింటికే చేరింది.. ఇంగ్లండ్‌ 44 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది.. ఎట్టకేలకు ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌నే వరించింది.. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోరులో ఇంగ్లండ్‌నే విజయం వరించింది.. తొలిసారి ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలవడంతో ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. క్రికెట్‌లో అసలు మజా ఏంటో ఫ్యాన్స్‌కు చూపించింది వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్‌.. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో […]

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. వన్‌సైడ్‌గా జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌….. 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. నాలుగో సారి వరల్డ్‌ కప్ ఫైనల్‌లో ప్రవేశించింది. లార్డ్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈ సారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌. రెండో సెమీస్‌లో భాగంగా… ఆసీస్‌తో […]

బుధవారం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ అభిమాని బట్టల్లేకుండా మైదానంలోకి పరుగులు తీశాడు. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి గ్రౌండ్‌లోకి ప్రవేశించిన ఆ అభిమాని నగ్నంగా తిరుగుతూ ఆటకు అంతరాయం కలిగించాడు. న్యూజిలాండ్‌ బాట్‌మెన్స్ టామ్‌ లాథమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.దీంతో వెంటనే […]

వరల్డ్‌ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుకు పాకిస్తాన్‌ షాక్‌ ఇచ్చింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ గెలుపు అంచుకు చేరుకుని..చివర్లో బోల్తా పడింది. నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌.. ఓటమిని మూటగట్టుకుంది. జో రూట్, బట్లర్ సెంచరీలు వృధా […]