కోరిక తీరితే చాలు.. వావి వరుసలు, మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలు బలిచేసుకుంటున్నారు. మామ తండ్రితో సమానమంటారు. అయినా కోడలిపట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కోర్కెలు తీర్చుకోవడమే పరమావధిగా చాటు మాటు వ్యవహారాలు సాగించాడు. దానికి కోడలు కూడా వంత పాడింది. మామ చేసే ప్రతి చర్యను సమర్థించింది. కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, భార్య రేణుక, […]

కళ్ల ముందే తండ్రి మరణం ఓ పక్క.. కోరి ఎంచుకున్న కెరీర్ మరోపక్క. అయినా ఆ చిన్న గుండె ఎంతో ధైర్యంగా నాన్నకలను సాకారం చేయాలనుకుంది. గుండె దిటవు చేసుకుని, ఉబికి వస్తున్న కన్నీటిని మునిపంటిన అదిమి పెట్టి ఆటకు సిద్దమయ్యాడు.. భారత క్రికెట్ జట్టు సారథి అయ్యాడు. ఓ ఆటగాడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. మానసిక దృఢత్వంతో కెరిరీ‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉండడాన్ని అలవాటు […]

అమ్మానాన్న అక్కర్లేదు కానీ.. ఆస్తులు మాత్రం కావాలి. రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని పెంచితే రెక్కలు వచ్చిన తరువాత ఇంటి నుంచి తరిమేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కన్న బిడ్డలు చూడట్లేదని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు కొందరైతే, కోర్టుల్ని ఆశ్రయించి న్యాయం చేయమని పోరాటం చేసేవారు మరికొందరు. ఒడిశాలోని దశరథపూర్‌కు చెందిన ఖేత్రమోహన్ మిశ్రా అనే రిటైర్డ్ ఉద్యోగి పాత్రికేయుడిగా పని చేశారు. ఆయన తనను వేధిస్తున్న కొడుక్కి తగిన శాస్తి […]

చదువూ సంధ్యా లేదు.. ఎప్పుడు చూసినా ఫోను.. సినిమాలు.. షికార్లు.. కొంచెమైనా బుద్ది ఉండక్కర్లా.. అంటూ నీతి వాక్యాలు పిల్లలతో పలికే ముందు ‘పెద్ద’లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. మరి నాన్నంతటి వాడు కావాలంటే ఆయన బాటలోనే నడవాలి కదా.. గేమ్స్ ఆడుకుంటానంటే తండ్రి తన 15 ఏళ్ల కొడుక్కి తన మొబైల్ ఇచ్చాడు. ఏదో నొక్కితే మరేదో వచ్చింది. అమ్మోయ్.. నాన్న చూడవే ఎలాంటి పనులు చేస్తున్నాడో.. అంటూ […]

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దారుణం జరిగింది. కన్న కూతురిని గర్భవతిని చేశాడో కీచక తండ్రి. విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి, బాలిక బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో క్షుద్రపూజలు కలకలం: తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాకినాడ గొడారిగుంట సీతారామాపురం ఉప్పర కమ్యూనిటిలో క్షుద్రపూజలు జరగడంతో… స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సర్పవరం […]

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి హృదయ విదారకమైన రోదన అందరి హృదయాలను కలిచివేస్తోంది. నాకు నా తండ్రి కావాలంటూ, కన్నీరుపెడుతూ ఘటనా స్థలం వద్దే భోరున విలపిస్తున్న బాలికను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చెర్లపల్లిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. తలపైనుంచి టైర్‌ ఎక్కేయడంతో.. […]