వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెరూసలేం వెళ్లేందుకు.. ఆర్థిక సాయం పెంచిన జగన్.. బద్రినాథ్, కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు సాయం చేయాలని.. హిందువులు కోరితే ఏం చేస్తారని నిలదీశారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు, ఓట్ల మూడ్ లోంచి బయటకు వచ్చి పాలనపై […]

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. గంగ పుత్రుల జీవితాలు మార్చే నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. ప్రజల బాధలను తీర్చడానికి సీఎం సీటులో ఉన్నానని తెలిపారు జగన్‌. ఈ పథకం ద్వారా లక్షా 36 వేల మంది మత్స్యకారులు లబ్ది పొందుతారని తెలిపారు. చేపల వేట నిషేధకాల సమయంలో ప్రతీ మత్స్యకార కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు జగన్‌. ఏప్రిల్‌ […]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీని నాశనం చేశారని విమర్శించారు. అమరావతి రాకూడదనే ఉద్దేశంతో కమిటీలపై కమిటీలు వేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ వ్యవహారశైలి వల్ల అమరావతిని కోల్పోయామంటూ మండిపడ్డారు. రెండురోజుల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి […]

ఏపీలో మద్యపాన నిషేదంలో భాగంగా బార్ల సంఖ్య భారీగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యపాన నిషేదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి, అధికారులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం నిర్ణయించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 50 శాతం బార్లు మూసేయాలని సీఎం జగన్‌ సూచించారని.. కానీ అధికారుల సూచనతో ప్రస్తుతం 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఏపీ […]

జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంచుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయాన్ని 40 వేల నుంచి 60 వేలకు పెంచారు. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. జెరూసలేంతోపాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనాస్థలాల సందర్శనకు వెళ్లే వారికి కూడా ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంపుపై గత […]

ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఇలాంటి అధికారులను సీఎం జగన్‌ కట్టడి చేయాలంటూ సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తాడిపత్రిలో గాయత్రీ మాతా దేవాలయాన్ని తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన బీజేపీ బూత్‌ లెవెల్‌ కార్యకర్తల మీటింగ్‌లో వీరు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌ తీరుపై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. జగన్‌ రెండు కాళ్లకు ఇసుక బస్తాలు కట్టి ఉన్న కార్టూన్‌ను ట్వీట్ కు ఎటాచ్ చేశారు.. ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉంది అంటూ.. ట్వీట్‌ కింద కామెంట్‌ చేశారు. మొత్తం 175 […]

వైసీపీ నేతల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు సైకోయిజం పీక్స్‌కు చేరిందంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. ఆఖరికి ఒంటరి మహిళని సైతం వైసీపీ నేతలు వదలడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారని.. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ విమర్శించారు. ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డి పాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన గోడను […]

ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్‌.. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారన్నారు. ఇందుకు పత్రిక కథనాలే నిదర్శనమన్నారు. తనమీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు. జగన్‌పై ఇంగ్లీష్‌ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ట్యాగ్‌ […]

ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకపోతే ప్రజలను చంపేయడంతో సమానమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్యచేసిందని ఘాటుగా ఆరోపించారు. ఇసుక కొరతతో పస్తులుంటున్న కార్మికుల కడుపు నింపే కార్యక్రమం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని మంగళగిరిలో ప్రారంభించి, వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులకు స్వయంగా ఆహారం వడ్డించారు. కార్తీక మాసం ఉపవాస దీక్ష వల్లే కార్మికులతో కలిసి తినలేకపోతున్నా తెలిపారు. బొత్సకు […]