కశ్మీర్ లో భద్రతా దళాలు పెద్ద ఆపరేషన్‌కు తెరతీశాయి. ఇక్కడి గాందర్బల్ అడువుల్లోకి అత్యున్నత బలగాలను హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తున్నాయి. పదిరోజులుగా ఈ వ్యవహారం సీక్రెట్‌గా నడుస్తోంది. ఇటీవల ఈ అడవుల్లో ఇద్దరు టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పటి నుంచి కూబింగ్ మరింత ముమ్మరం చేశారు. ఇక్కడి వెళ్లడానికి ఎలాంటి రోడ్లు లేవు. దీంతో సైన్యాన్ని వేగంగా అక్కడకు చేర్చేందుకు ఎయిర్ లిఫ్ట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల గాందర్బల్ అడవుల్లో […]

జమ్మూకాశ్మీర్‌ను కేంద్రం రెండుగా విభజించింది. 370 రద్దుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు అధికారులకు ఒక సవాలే అని చెప్పాలి. అక్కడ ప్రభుత్వం లేదు. అంతా అధికారుల పాలనే. భద్రత నుంచి సంక్షేమం వరకు అంతా అధికారులే చూసుకోవాలి. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను జమ్మూకశ్మీర్‌కు బదిలీ చేసిన కేంద్రం…అందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లకు అత్యంత సున్నితమైన కశ్మీర్‌ లోయలో […]

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయం లో దాయాది దేశం నాటకాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని వార్నింగ్ ఇచ్చింది. పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసు అంటూ పాక్‌కు సూటిగానే హెచ్చరికలు పంపింది. కశ్మీర్ విభజన, ఆర్టికల్-370 రద్దుపై పార్లమెంట్‌ లో జరిగిన చర్చలో మోదీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చెలరేగిపో తున్న వేళ, […]

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడాన్ని బాలీవుడ్‌ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై బాలీవుడ్‌ నటీనటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయమన్నారు హీరోయిన కంగనా రనౌత్‌. ఇది ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగపడుతుందని…ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని మోదీ మాత్రమే తీసుకోగలరని ప్రశంసించారు. […]

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో పలు కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను విభజించగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము,కశ్మీర్‌లను విభజించారు. ఈ నిర్ణయంతో కశ్మర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దుతో […]

ఆర్టికల్‌ 370 అనేది కేంద్రానికి జమ్ముకశ్మీర్‌తో ఉన్న బంధాన్ని వివరిస్తుంది. దేశ రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాల్లో మినహా మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులను మార్చే అధికారం కూడా పార్లమెంట్‌కు లేదు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినా కశ్మీర్‌ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానికి ఉండదు. ఇక ఆర్టికల్‌ 35ఏ ద్వారా జమ్ము కశ్మీర్‌లో శాశ్వత నివాసితులు ఎవరు […]