వైసీపీ నేతలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను కూడా వైసీపీ నేతల కంటే ఎక్కువే వ్యక్తిగత విమర్శలు చేయగలనని.. కానీ అది సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ముందు పార్టీ పేరు చేర్చడాన్ని తప్పుపట్టారు. విశాఖలో నిర్వహించిన జనసైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పవన్. సమాజం పట్ల ప్రేమ ఉండబట్టే.. అన్నింటినీ వదిలి పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రజలు […]

రాజధాని తరలింపు ప్రచారం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని మార్చాలనుకోవడం అవివేకమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్ధులపై కోపంతోనో.. లేక సొంత వారి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాజధాని తరలించే కుట్రలకు పాల్పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ విషయంలో హైడ్రామా నడిచింది. చివరికి ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే..స్వయంగా రాజోలు వస్తానంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యానికైనా తెగపడొచ్చన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు లోకేష్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు బెయిల్‌ మంజూరైంది. స్టేషన్‌ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. మలికిపురం పీఎస్‌పై దాడి […]

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెంచారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కొత్త తరం రాజకీయ వ్యవస్థ రూపకల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేనాని.. భవిష్యత్తులో బలం పెంచుకునేందుకు ఇప్పట్నుంచే పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన కమిటీలను ప్రకటించనున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పరిపుష్టం చేయాలనే కృత నిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు.. ఇటీవల […]

ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకున్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఓటమికి కారణాలు.. ఫలితాల తరువాత జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశమయ్యారు జనసేన అధినేత. శ్రీకాకుళంలో ఓటమికి కారణాలను నేతలు వివరించారు. ఈ సందర్భంగా ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదని.. కష్టపడి పనిచేస్తే […]