సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న కర్నాటక పాలిటిక్స్ చివరి దశకు వచ్చాయి. సోమవారం కుమారస్వామి భవిష్యతు తేలిపోనుంది. ఈ ఎపిసోడ్‌‌ ఎలాంటి టర్న్ తీసుకోనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండూ పార్టీలు వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి. అటు.. ముంబైలో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేల్ని బుజ్జగించే పర్వం కొనసాగుతోంది. 15 మంది రెబల్ […]

కర్ణాటక అసెంబ్లీలో.. కుమారస్వామి బలపరీక్ష అనేక మలుపులు తిరుగుతోంది. సభలో స్పీకర్ అధికారలకే ప్రాధాన్యం ఉండటం, గవర్నర్ జోక్యం చేసుకోవడంతో సభలో వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో చెలరేగిపోయారు. ఇరు పార్టీల విమర్శలతో స్పీకర్ కూడా అసహనానికి గురయ్యారు. గవర్నర్, అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య తాను నలిగిపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్. అధికార, ప్రతిపక్షాలు స్పష్టత లేని అంశాలను ప్రస్తావించి అసెంబ్లీలో రగడ సృష్టిస్తున్నాయని […]

కర్నాటకలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కుమారస్వామి.. చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును ఎండగట్టారు కుమారస్వామి. ప్రభుత్వం అధికారాన్ని లాక్కోవడానికి ఎన్నో కుట్రలు జరిగాయని ఆరోపించారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ సహకారం ఉందని ఆయన అన్నారు. ఏడాది కాలంలో తమ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందన్న కుమారస్వామి.. రాష్ట్రానికి మంచి చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తమ […]

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. అసెంబ్లీలో బలాబలాలు లెక్కలు ఎలా వేసుకున్నా.. సీఎం కుమారస్వామి బలపరీక్ష పాసవ్వడం అసాధ్యమని తేలిపోతోంది. రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు ససేమిరా అంటున్నారు. హాజరైనా ప్రస్తుత సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఇదిలా ఉంటే, అందరి దృష్టి ప్రస్తుతం అసంతృప్తి ఎమ్మెల్యేలు, స్పీకర్‌పైనే పడింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు.? స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? అన్న ప్రశ్నలు […]

అసమ్మతి చల్లారడం లేదు. రెబల్‌ ఎమ్మెల్యేలు దారికి రావడం లేదు. మనసు మార్చుకుని సొంత ఇంటికి వచ్చినట్టే వచ్చిన ఎమ్మెల్యేలు..మళ్లీ యూటర్న్‌ తీసుకోవడంతో కర్నాటక సంకీర్ణం మరోసారి గందరగోళంలో పడింది. సినిమా ట్విస్టులను మించి కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఎత్తుకుపై ఎత్తులు, వ్యూహాలకు, ప్రతివ్యూహాలతో కన్నడ పొలిటికల్‌ ఎపిసోడ్‌ రసవత్తరంగా మారింది. అసమ్మతి ఎమ్మెల్యేలు నాగరాజు, సుధాకర్‌ మళ్లీ రెబల్‌ గూటికి చేరడంతో తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్‌, జేడీఎస్‌ […]

కర్ణాటకలో…. రాజకీయ హైడ్రామాకు ఇప్పట్లో పుల్‌స్టాప్‌ పడే అవకాశాలు కనిపించడం లేదు. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్‌ నేతలు దిగి రావడం లేదు. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని శనివారం […]

కర్ణాటకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకోన్న సంక్షోభం క్లైమాక్స్‌ దశకు చేరినట్టు కనబడుతుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని సుప్రీంకోర్టు నేడు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బెంగళూరులోని విధానసౌధకు చేరుకున్నారు. వారితో భేటీ […]

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులను కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బుజ్జగిస్తూనే ఉన్నారు. సీఎల్పీ సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటు ఈనెల 21న క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని మాజీ సీఎం సిద్ధారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆపరేషన్ కమల్‌కు చెక్‌ పడుతుందని పేర్కొన్నారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా […]

కర్ణాటకలో ఏం జరగబోతోంది? 13 నెలల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడినట్లేనా? స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాబోయే 24 గంటల్లో కర్ణాటక రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయ్..అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి బంతి మాత్రం స్పీకర్‌ కోర్టులోనే కనిపిస్తోంది. స్పీకర్‌ ముందు నాలుగు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో […]