తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రముఖుల ఊళ్లలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పాగా వేస్తే…మరికొన్ని ఊళ్లలో ఒకే ఓటుతో అభ్యర్థులు గెలవడం ఆసక్తి రేపింది. ఇక ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో లాటరీ పద్దతిలో విజేతను ఎంపిక చేశారు ఎన్నికల అధికారులు.తెలంగాణ ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించినా.. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతల స్వగ్రామాల్లో మాత్రం ఓటమి తప్పలేదు. సీఎం కేసీఆర్, మాజీ […]

పరిషత్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్ట్స్ తరహాలోనే దుమ్మురేపింది టీఆర్ఎస్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడుకు వార్ వన్ సైడ్ అయ్యింది. 32కు 32 జడ్పీ పీఠాలు గంపగుత్తగా టీఆర్ఎస్ వశం అయ్యాయి. అటు మండల పరిషత్ లో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. దాదాపు 500కుపైగా మండల పరిషత్ లు కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్, బీజేపీ ఎక్కడా ప్రభావం చేపించలేకపోయాయి. కొన్ని […]

ఎన్నికల్లో ఓడిపోయినా.. నిజామాబాద్‌ను వీడనన్నారు మాజీ ఎంపీ కవిత. గెలుపు ఓటములు సహజమేనని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎంపీగా ఓటమిపాలైన తరువాత తొలిసారి నిజామాబాద్‌లో పర్యటించారామె. మంచిప్పలో ఇటీవల గుండెపోటుతో మరణించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచిన వారు హామీలు నెరవేర్చాలని కవిత కోరారు.