నిమ్స్‌ ఆస్పత్రిలో మల్లు భట్టి విక్రమార్క దీక్ష కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. 3 రోజుల దీక్ష కారణంగా భట్టి శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో.. అత్యవసరంగా చికిత్స చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. సెలైన్ పెట్టించుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్యులు. అటు భట్టిని.. టీజేఏస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని […]

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు విజ‌యం సాధించారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయని చెప్పారాయన. ఎర్రజొన్న, ప‌సుపు రైతుల సమస్యలను స‌రిగా ప‌రిష్కరించ‌నందుకే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజా స‌మ‌స్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల‌ని సూచించారు. తెలంగాణవ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు కోదండరాం. ప్రజా స‌మ‌స్యలపై రానున్న రోజుల్లో ఉద్యమాన్ని […]