maharastra

మహారాష్ట్రలో పూర్తైన కేబినెట్ విస్తరణ

ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ ఈ సోమవారం పూర్తైంది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వీరితో పాటు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు మంత్రులుగా ప్రమాణం […]

దర్జాగా వచ్చి.. దొంగలా చిక్కాడు

జైల్లో ఉన్న తన స్నేహితులను చూసేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. మహారాష్ట్రకు చెందిన పార్ధి గ్యాంగ్‌ గత కొంతకాలంగా రైల్వే సిగ్నల్‌ లైన్‌ కట్‌ చేసి చోరీలకు పాల్పడుతోంది. రైలు ఆగిన వెంటనే ఒకరిపై ఒకరు నిచ్చెనలా మారి బోగి కిటికీల దగ్గర ఉన్న వాళ్లను రాళ్లతో బెదిరించి దోచేయడాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఇదే తరహాలో అనేక చోట్ల భారీ […]

మహారాష్ట్రలో పట్టు కోల్పోతున్న శివసేన.. శాసిస్తున్న ఎన్సీపీ

మహారాష్ట్ర అవాస్ అఘాడిలో శివసేన పట్టు కొల్పోతోందా? కూటమిలో నిర్ణయాధికారానికి బదులు.. నిర్ణయాలు పాటించే స్టేజ్ కి దిగజారుతోందా? మంత్రుల పంపకాల లెక్కలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. కూటమిలో ఎన్సీపీ మంత్రాంగం ముందు శివసేన సైలెంట్ అవ్వాల్సి వస్తోంది. అందుకే ఎన్సీపీ కంటే తక్కువ మంత్రి పదవులతో అడ్జెస్ట్ అవుతోంది శివసేన. మహారాష్ట్రలో శివసేనకు ఓ బ్రాండ్ ఉండేది. సీఎం కుర్చీలో లేకున్నా.. […]

సంకీర్ణ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు

మహారాష్ట్రలో సంకీర్ణ శకం ఆరంభమైంది. ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్‌ థాక్రే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన ఉద్ధవ్‌ థాక్రే.. మిత్రులుగా ఉందాం, కలిసి పనిచేద్దామంటూ విపక్షాలకు పిలుపునిచ్చారు. అటు మంత్రివర్గ కూర్పులో ఆధిపత్యం ప్రదర్శించాలని ఎన్సీపీ అధినేత పవార్‌ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 16 కేబినెట్‌ బెర్తులు ఎన్సీపీ ఖాతలో పడే ఛాన్స్‌ […]

విభేదాలు లేవు.. కామన్ మినిమం ప్రోగ్రామ్ పై క్లారిటీ ఉంది: మహావికాస్ అఘాడీ

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమైంది. డిసెంబర్‌ 3లోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారీ ఆదేశించడంతో విశ్వాస పరీక్షకు రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు సాధించగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మహావికాస్‌ అఘాడీకి 162 మంది ఎమ్మెల్యేల […]

బలం నిరూపించుకోనున్న కూటమి

శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారుకు బల నిరూపణ ఖరారైంది. అసెంబ్లీలో శనివారం మధ్యాహ్నం.. బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌థాక్రే.. శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రోటెం స్పీకర్‌గా ఎన్సీపీకి చెందిన దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ నియమితులయ్యారు. ఎస్పీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుండటంతో బలనిరూపణ […]

ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

శివసేన చరిత్రలో కొత్త అధ్యాయం. థాక్రే కుటుంబంలో నవోత్సాహం. ఉద్ధవ్ థాక్రే పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. గురువారం సాయంత్రం 6.40 నిమిషాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రితో పాటు సంకీర్ణ కూటమిలోని ఒక్కో పార్టీ నుంచి ఒకరిద్దరు మంత్రుల చొప్పున ప్రమాణం చేస్తారు. శివసేన కల నెరవేరింది. ప్రభుత్వాన్ని […]

సరికొత్త మహారాష్ట్రను ఆవిష్కరిస్తాం: ఆదిత్య ఠాక్రే

నవ మహారాష్ట్ర నిర్మాణమే తమ లక్ష్యమని శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. విధానసభలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని.. ఎంతోమంది సీనియర్ల మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. మంత్రిమండలి ఎలా ఉండాలి.. ఎవరెవరు ఉండాలన్నది ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పెద్దలు నిర్ణయిస్తారని.. మూడు పార్టీల కలిసి సరికొత్త మహారాష్ట్రను ఆవిష్కరిస్తారని అన్నారు.

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

గురువారం మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఉద్దవ్ ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారు. గురువారం సాయంత్రం 6:30కి శివాజీ పార్క్‌లో ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సీఎం ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా.. లేక డిప్యూటీ సీఎంలు కూడా […]

ఠాక్రే కుటుంబం నుంచి తొలి సీఎం..

మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా ముగిసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు మార్గం సుగమమైంది. ఠాక్రే కుటుంబం తొలి సీఎంగా గురువారం శివాజీ పార్క్‌లో ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనూహ్య పరిణామాలు, ఉత్కంఠ భరిత మలుపులతో సాగిన మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం కీలక ఘటనలు చోటుచేసుకుంది. బుధవారంలోగా బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంతీర్పుతో ప్రారంభమైన క్లైమాక్స్ […]