పరిషత్ ఎన్నికల్లో గులాబీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఎమ్మెల్యేలు, సినియ‌ర్ లీడ‌ర్లు జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారసులు కూడా తమ రూట్లో తాము ప్రయత్నాలు చేస్తుకుంటున్నారు. అయితే..నాయకత్వం ఎవరికి తీపికబుతు అందిస్తుందనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ‌ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీఆరెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. 32కు 32 […]

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నల్గొండ, రంగారెడ్డిలో కాంగ్రెస్‌కి కాస్త బలం కనిపించినా.. వరంగల్‌లో విజయం ఏకపక్షమైంది. నల్గొండలో తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. ఇక వరంగల్‌లో భారీ మెజార్టీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గెలిచారు. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కూడా విజయం సాధించడంతో.. MLC ఎన్నికల్లో కార్ తీర్‌మార్ కొట్టనట్టయ్యింది. […]

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పై గెలుపొందారు.

ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం జరగనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక కోటా ఎమ్మెల్సీల స్థానాల ఉప ఎన్నిక కోసం ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మే 31న జరిగిన ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల పరిధిలో 2799 […]

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌రావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. నవీన్‌రావుతో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒకటే సీటు కావడంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా.. అప్పుడు గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు.