పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఘాటుగా స్పందించారు. ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌లో కట్టుకట్టినట్లుంది మీ తెలివి అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టులో తగ్గించి, ఎలక్ట్రికల్‌ బస్పుల్లో పదింతలు పెంచిన లాజిక్‌.. రివర్స్‌ టెండరింగ్‌ వెనకున్న అసలైన మ్యాజిక్కని సామాన్య ప్రజలకు కూడా అర్ధమైంది తుగ్లక్‌ ముఖ్యమంత్రి గారూ అంటూ ట్విట్టర్‌ వేదికగా లోకేష్‌ సెటైర్లు […]

గుంటూరు జిల్లాలో వరద బాధితులకు.. కాలం చెల్లిన వంట నూనె ప్యాకెట్స్‌ పంపిణీ చేయడం… తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై వరద బాధతులు మండిపడుతున్నారు. అటు లోకేష్‌ సైతం… ప్రభుత్వ తీరును నిలదీశారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఆ వంట నూనెల్ని వాపసు తీసుకుని కొత్త వాటిని ఇస్తామంటూ ప్రకటించారు గుంటూరు జిల్లా కలెక్టర్‌. ఏపీలో జగన్‌ సర్కారు…. తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజాగ్రహానికి […]

ఏపీ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఆలయాలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణుడి ఆలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక పూజలు చేయించారు. ప్రత్యేక పూజల తరువాత పూజారులు లోకేష్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. తరువాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన లోకేష్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. Also watch :

ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ సానుభూతిపరులను టార్గెట్‌ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇది తగదని అన్నారాయన. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ కార్యకర్తల ఇళ్లు కూల్చేయడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ నాయకుల ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధమైందనే పేపర్ కటింగ్‌ను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇకనైనా ఇలాంటి […]

ఆంధ్రప్రదేశ్‌లో కియా ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కియా మోటార్స్‌ సంస్థని ఏపీలో నెలకొల్పడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదన్నారు. నేడు కియా సంస్థ నుండి మొట్టమొదటి మేడిన్‌ ఆంధ్రా కారు విడుదలవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షాలు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌. ఇది ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితం. కియా మోటార్స్ సంస్థని ఆంధ్రప్రదేశ్ […]

వైఎస్‌ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్. ఈ రెండున్నర నెలల్లో అంతా కమిటీలు, కమీషన్‌లే నడిచాయని ఆరోపించారు. వైసీపీ నేతలంతా గాల్లో తిరుగుతూ..భూమిపై సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు లోకేష్. మొత్తం 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..ఎకరాకు 10వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. రాజధాని అమరావతిని నిర్మించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి […]

ఎడతెరిపిలేని వర్షాలు. చినుకులు వరదలయ్యాయి. గోదావరితో పాటు దాని ఉపనదులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీనికితోడు పోలవరం దగ్గర బ్యాక్ వాటర్ గిరిజన గ్రామాలను ముంచేస్తున్నాయి. కొద్దిమేర వర్షం ఎడతెరిపి ఇచ్చినా..రాబోయే రెండు మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల జనం ఆందోళన చెందుతున్నారు. ముసురు వర్షం ముంచేస్తుంటంతో జనం పడుతున్న […]

ట్విట్టర్‌ వేదిక ఏపీ సీఎం జగన్‌ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.. 46 ఏళ్ల జగన్‌కు ఉద్యోగం వచ్చింది.. కానీ 45 ఏళ్ల పెన్షన్‌ రత్న మాత్రం మాయమైంది అంటూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు లోకేష్‌. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే మర్చిపోయారా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు‌. బీసీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ అన్న […]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ట్వీట్లతో చెలరేగి పోయారు. కియా మోటార్స్ వ్యవహా రంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌లో పంచ్‌లు వేశారు. 2007లోనే వైఎస్సార్, కియా కంపెనీని ఏపీకి ఆహ్వానించా రని, మరి వాళ్లెందుకు రాలేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పుకోలేదూ అంటూ సెటైర్లు వేశారు.

ఏపీ బడ్జెట్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్‌ వేదికగా సర్కార్‌ తీరును ఎండగట్టారు. రైతుల్ని, అమ్మఒడి లబ్ధిదారుల్ని సీఎం జగన్‌… అవమానించారంటూ ట్వీట్‌ చేశారు. బడ్జెట్ చూస్తుంటే.. జగన్‌ నామమాత్ర సీఎంలా అనిపిస్తున్నారంటూ సెటైర్‌ వేశారు లోకేష్‌. జగన్‌ ప్రభుత్వ బడ్జెట్‌పై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌….. ట్విట్టర్‌ వేదికగా సెటైర్లతో రెచ్చిపోయారు బడ్జెట్ లో జగన్ కేటాయింపులే నామమాత్రమా? లేక.. హామీలు కూడా […]