protest

ముప్పాళ్ల నాగేశ్వర్ రావుకు పోలీసుల నోటీసులు

ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి విపక్షాలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపక్ష నాయకులకు నోటీసులు అందిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వర్‌రావు నోటీసులు అందుకున్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన జేఏసీ నేతలు

అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో 20 సంఘాల నాయకులు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ ను కలిశారు. రాజధాని మార్పు నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్ కు వివరించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు నిరంకుశత్వంగా దాడులు చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అమరావతిలో సెక్షన్ […]

బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

రాజధాని గ్రామాలు 31 రోజులుగా అట్టుడుకుతున్నాయి. సంక్రాంతి కూడా జరుపుకోకుండా ప్రజలు దీక్షలకే పరిమితమయ్యారు. పోలీసుల దమనకాండ, లాఠీఛార్జ్‌నూ లెక్కచేయలేదు. రక్తం చిందినా జై అమరావతి నినాదం మానలేదు. అక్కడ అంత సీరియస్‌గా, ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బాధను, ఆవేదనను పెద్దగా చెవికెక్కించుకున్నట్లు కనపడంటం లేదు. హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స […]

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎందుకు నిరూపించలేకపోతున్నారు: లోకేష్

రాజధాని తరలింపును ఒప్పుకునేది లేదన్నారు మాజీ మంత్రి లోకేష్‌. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో సీతారామ ఆలయం జంక్షన్‌ నుంచి అంబేడ్కర్ సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో […]

సుప్రీం కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదు.. అమరావతి పోలీసులకు హైకోర్టు ప్రశ్న

అమరావతిలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై మగ పోలీసులు ఎందుకు దాడి చేశారని అడ్వకేట్‌ జనరల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. ఏ కారణంతో 610 మందిని అరెస్ట్‌ చేశారని.. మహిళపై కాలుతో దాడి చేయడం ఏంటని.. మహిళ నోరు నొక్కే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని.. ఇలా వరుస ప్రశ్నల వర్షం కురిపించారు.. రాజధానిలో 144 […]

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్న అమరావతి రైతులు

నిరసనలు, ర్యాలీలు, మహాధార్నాలతో రాజధాని ప్రాంతం దద్దరిల్లుతోంది. అమరావతి గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 31వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు చలించలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. రాజధాని మహిళలు శుక్రవారం విజయవాడ దుర్మమ్మ సన్నిధి వరకు ర్యాలీ నిర్వహించి నైవేద్యం పెట్టే అవకాశం ఉంది. నిరసనల్లో భాగంగా మందడం, […]

వన్ స్టేట్.. వన్ క్యాపిటల్ పేరుతో కదం తొక్కిన ఎన్నారైలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొసానగించాలని అమెరికాలో ప్రవాసాంధ్రులు కోరుతున్నారు. చార్లెట్ నగరంలోని వందలాదిమంది ఎన్నారైలు అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా అమరావతిలో ఉన్న రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు ప్రొఫెసర్ శ్రీనవాస్ కొలికపూడి, వీడియో కాన్పరెన్స్ ద్వారా ఉద్యమ […]

ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందంటున్న అమరావతి రైతులు

రాజధానిని మార్చొద్దంటూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపిందంటున్నారు తుళ్లూరు రైతులు. మూడు రోజుల్లో రైతులు తమ అభిప్రాయాన్ని ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలంటూ సీఆర్డీఏ వైబ్ సైట్ ఏర్పాటు చేసింది. అయితే, ఈ వెబ్ సైట్ ఓ కొత్త నాటకమంటూ రైతులు మండిపడుతున్నారు. అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం మరో మోసానికి తెరతీసిందని విరుచుకుపడుతున్నారు

ఈ ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉంది: సీపీఐ నారాయణ

అమరావతి ఉద్యమం దేశమంతా పాకిందన్నారు సీపీఐ నేత నారాయణ. అందరూ ఒప్పుకున్నాకే అమరావతిని నిర్ణయించారని.. రాజధానిని ఇప్పడెందుకు 3 ముక్కలు చేస్తున్నారని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా ప్రభుత్వ తీరు ఉందని నారాయణ మండిపడ్డారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని.. మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నారు. ఎక్కడైనా ధర్నాలు వామపక్షాలు చేస్తాయని.. కానీ సీఎం ప్రజలందరిని ధర్నాలు […]

జై అమరావతి నినాదాన్ని హోరెత్తిస్తున్న రైతులు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం 30వ రోజుకు చేరుకుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. రైతులు చనిపోతున్నా.. మహిళలు కంటతడి పెడుతున్నా.. వారి గోస ఎవరికి పట్టడం లేదు. ఇప్పటికే పండగకు దూరంగా ఉన్న రాజధాని గ్రామాల రైతులు.. పోరును మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం మందడం, తుళ్లూరులో మహాధర్నాకు దిగారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో […]