మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు బాధగా ఉందన్నారాయన. ఈసీ మెంబర్‌ పదవికి రాజీనామా చేస్తానన్నారు. సినీ పెద్దలు జోక్యం చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మా ప్రెసిడెంట్‌గా గెలిచిన నరేష్‌.. ప్రెసిడెంట్‌ […]