కశ్మీర్‌పై నానాయాగి చేస్తున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికపై తడపడింది. స్వయంగా పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ, ఆ దేశం పరువు తీసేశారు. కశ్మీర్ తమదే అంటూ పాకిస్థాన్ చేస్తున్న వాదనలో డొల్లతనాన్ని పాక్ మంత్రి బట్టబయలు చేశారు. ఇంటర్నేషనల్ స్టేజ్‌లపై భారతదేశాన్ని ఇరికించే క్రమంలో మనసులో మాటను బయటపెట్టారు. కశ్మీర్ భారత్‌దేశానిదే అని ఖురేషీ అంగీకరించారు. జమ్మూకశ్మీర్‌ను ఇండియన్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అని ఖురేషీ స్పష్టంగా పేర్కొన్నారు. […]