శబరిమల వివాదాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే మహిళల ప్రవేశంపై జరుగుతున్న రాద్దాంతం అంతాఇంతా కాదు.. తాజాగా ఆలయానికి చెందిన బంగారం మాయమైందని వస్తున్న ఆరోపణలు మరింత కలవరపెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కిలోల బంగారం, వంద కేజీల వెండి కనిపించడం లేదని తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగాదుమరం రేపుతోంది. ట్రావెర్ కోర్ దువస్వామ్ బోర్డు దీనిపై దృష్టి సారించింది. అయ్యప్ప ఆలయానికి భక్తులు […]