తెలంగాణ సచివాలయం అడ్రస్‌ నేటి నుంచి అధికారికంగా మారుతోంది. ఇప్పటివరకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలో సువిశాల ప్రాంగణంలో ఉన్న పాత సచివాలయం కనుమరుగు కానుంది. త్వరలోనే అక్కడ మరో పెద్ద సెక్రటేరియట్‌ ఆవిర్భవించనుంది. అప్పటివరకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌ తాత్కాలిక సచివాలయంగా కొనసాగనుంది. ఇప్పటికే అక్కడ సీఎస్‌ ఛాంబర్‌ సిద్ధం కాగా… ఇతర ప్రిన్సిపల్ సెక్రెటరీల ఛాంబర్లు రెడీ అవుతున్నాయి.

సెక్రటేరియట్‌ కూల్చివేతకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ కొత్త భవనాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.. కొత్త నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌ అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ కొత్త భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.. ప్రగతి భవన్‌లో […]