సెల్ఫీ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు వినిపిస్తున్నా మళ్లీ అదే పని చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జలాశయాలు, కొండల అంచున నిలబడి తీసుకునే సెల్ఫీ మరీ డేంజర్ అని తెలిసి కూడా వారి చర్యలు మానట్లేదు. సరదగా సాగాల్సిన ట్రిప్ విషాదాంతమవుతుంది సెల్ఫీల కారణంగా. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీప పాంబారు జలాశయం చూసేందుకు ఆదివారం జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. అక్కడి […]

ఉద్యోగం, ఉపాధి పేరుతో భర్తలు దూరంగా.. భార్యలు మరో ప్రపంచంలో. టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇప్పుడు టిక్‌టాక్ జోరు నడుస్తోంది. అతి అనర్ధానికి దారితీస్తుంది. సరదాగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అదే శృతి మించితే పర్యవసానం ఇలానే ఉంటుంది. టిక్‌టాక్ వ్యసనానికి బానిపై ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా ఓ వివాహిత టిక్‌టాక్ ఫ్రెండ్‌తో పరిచయాన్ని పెంచుకుని ఆమెతోనే ఉడాయించింది. తమిళనాడు శివగంగై జిల్లా […]

అటవీ ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న ఓ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మహిళను పొదల్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని వాళప్పాడి సమీపంలో ఉన్న మెయ్యమలై అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా మన్‌నాయకన్‌ పట్టికి చెందిన 32 ఏళ్ల వివాహితకు తను పని చేస్తున్న కంపెనీలో 25 ఏళ్ళ  దినేష్‌ అనే వ్యక్తితోో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర […]

80 ఏళ్ల వయసులో ఏం చేయగలనని ఏనాడూ అనుకోలేదు ఆ బామ్మ. నలుగురికీ నాలుగు ఇడ్లీలు తయారు చేసే ఓపిక ఇచ్చాడు ఆ భగవంతుడు అని.. అదీ కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తోంది. ఒక్కరూపాయికే నాలుగు ఇడ్లీలు అందిస్తూ ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకుంది. రూపాయికి ఏమొస్తుంది అని అనుకునే ఈ రోజుల్లో నాలుగు ఇడ్లీలు ఇచ్చి పేదల కడుపునింపుతోంది. తన పడుతున్న కష్టాన్ని కడుపులోనే దాచుకుంది. […]

కష్టమో.. సుఖమో.. కనిపెంచింది.. పెద్దవాడ్ని చేసింది. విద్యాబుద్దులు నేర్పించింది. కొడుకు తన కాళ్ల మీద తాను బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. వృద్ధాప్యంలో కొడుకు ఆదరణకు నోచుకోలేకపోయింది. పట్టెడన్నం కరువై పరలోకానికి వెళ్లిన తల్లికి అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఆమె శవాన్ని చెత్త కుండీలో పడేసి చేతులు దులుపుకున్నాడు చెట్టంత ఎదిగిన కొడుకు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. మనుషుల్లో మానవత్వం నశించిపోతుందనడానికి నిదర్శనంగా మారింది. […]

హారి పిడుగా.. ఇప్పుడే కదరా పుట్టింది. అప్పుడే రెండు పళ్లొచ్చాయా అని ఆనంద పడ్డానికి లేదు. అవి వుంటే వాడికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పి ఆ రెండు పళ్లనీ తొలగించారు. తమిళనాడు రాష్ట్రం సేలంలోని వాడుగపట్టికి చెందిన రమేష్, విజయలక్ష్మి దంపతులకు ఈ నెల 1న మగబిడ్డ పుట్టాడు. పుడుతూనే రెండు పళ్లు నోట్లో ఉండడాన్ని గుర్తించారు డాక్టర్లు. వెంటనే వాటిని తొలగించకపోతే అవి ఊడి ఊపిరితిత్తులలోకి చేరే […]

ఆహా! మేమెంత లక్కో మా బాసెంత మంచోరో. మూణ్ణెల్ల ముందుగానే పండగ అడ్వాన్స్ ప్రకటించారు. పండగ నెలరోజులు ఉందనగా పదివేలు చేతిలో పెడతారు. ఏమి హాయిలే హలా. ఈ పండగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చని తమిళ తంబిలు సంతోషపడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ రాకుండానే తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం పళనిస్వామి ఉద్యోగుల ఫెస్టివల్ అడ్వాన్స్‌కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా […]

భారతదేశంలో ఎన్నో ఆలయాలు మరెన్నో సంప్రదాయాలు.. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు.. పరిశోధకులకు సైతం అంతు చిక్కని రహస్యాలు. అదేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు.. కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తున్నారు ఓ పూజారికి. అభిషేకం అంటే పంచామృతాలు.. పాలతో కదా చేసేది అంటే ఇది ఈ ఆలయ ఆచారం అంటున్నారు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో ఆడి అమావాస్య సందర్భంగా కరుప్పుస్వామి ఆలయంలో ఇటువంటి వింత ఆచారం కొనసాగుతోంది. […]

మహిళ ఎందుకిలా మారిపోతుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చాలనుకుంది. తమిళనాడు వేలూరు జిల్లా అత్తనవూరుకు చెందిన సెల్వం హోసూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య జయమతి, ఒక కూతురు ఉన్నారు. జయమతికి చదువుకునే రోజుల్లో ఓ అధ్యాపకుడితో పరిచయం ఏర్పడింది. వివాహమైన తరువాత కూడా అతడితో సంబంధాన్ని కొనసాగించింది భర్తకు తెలియకుండా. కొన్నాళ్లకు భర్తకు విషయం తెలిసి భార్యను నిలదీశాడు. అయినా ఆమె తన వ్యవహారాన్ని మార్చుకోలేదు. […]

పెళ్లి వయసు వచ్చినా ఇంకా ఇప్పుడే వద్దంటావేంటి.. నోరుమూసుకుని కూర్చో అని ఓ వరుడ్ని వెతికి మూడు ముళ్లు వేయించారు. తమ పనై పోయిందనుకున్నారు. అమ్మాయిగా అతడికి అర్థాంగి అయిందేమో కానీ మనసు, తనువు మరొకరికి ఇచ్చేసింది. ఆ విషయం పెళ్లయిన వారం రోజుల్లోపే ఆమె జంప్ అయ్యేసరికి ఇంట్లో వారికి తెలిసింది. ఆ ఇచ్చింది అబ్బాయికి కూడా కాదు అమ్మాయికి అని తెలిసి అవాక్కయ్యారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా […]