ఏపీలో ఇసుక దుమారం రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. నవంబర్‌ 14న చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు సిద్ధమవగా.. అదే రోజు నుంచి వారం పాటు ఇసుక వారోత్సవాలు నిర్ణయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. అటు వామపక్షాలు, భవన నిర్మాణ కార్మికుల ఆందోళనలు పలు చోట్లు ఉద్రిక్తంగా మారాయి. నవంబర్‌ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్రంలో ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఎవరైనా […]

తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ పరిస్థితి మరొకరికి రాకూడదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతోందని.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షం కనిపించకుండా చేయాలని సీఎం జగన్‌ కుట్ర […]

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న విజయవాడ ధర్నాచౌక్ వేదికగా 12 గంటలపాటు దీక్షకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇసుక సమస్యపై రౌండ్ రేబుల్ సమావేశం నిర్వహించిన టీడీపీ.. ఇతర రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములను చేస్తోంది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ధర్నాచౌక్ ప్రాంతాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతారంటున్నారు టీడీపీ […]

పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.. హైదరాబాద్‌ ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పయ్యావులను ఆయన పరామర్శించారు. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ భవనంలో పీఏసీ సమావేశంలో ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే పయ్యావుల వాంతులు చేసుకొన్నారు. దీంతో పయ్యవులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల పయ్యావుల అనారోగ్యానికి […]

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేస్తూ.. కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే.. సీఎం జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లను పెంచారని మండిపడ్డారు. […]

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ఒకరోజు దీక్ష చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నెల 14న విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలైనా.. ఇసుకను అందుబాటులోకి తేలేదని విమర్శించారు. భవన కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు తప్పుపట్టారు. గతంలో మాదిరి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీ […]

చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సోమవారం టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముందుగా కోడెల శివప్రసాద్‌కి నివాళలర్పించడంతోపాటు గోదావరి బోటు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం 12 అంశాలపై చర్చతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించి అక్కడి నుంచి పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి కమిటీలో బలహీన వర్గాలకు పెద్ద పీట వేయనున్నారు. సామాజిక వర్గాల […]

శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాదులు వేసిన ఫిటిషన్ ను సీబీఐ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. జగన్‌ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. మనదేశంలో చదువులకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ… బెయిలుకు కాదన్నారు. కోర్టు ఖర్చులకు ప్రజాధనం కాకుండా.. సొంత డబ్బులు […]

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. జీవో నెంబర్ 2430 కాపీలను టీడీపీ నేతలు తగులబెట్టారు. అటు.. బీజేపీ నాయకులు సైతం.. ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏలూరులోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గత నెల 11 నుంచి పలు కేసుల్లో చింతమనేని రిమాండులో ఉన్నారు. వరుసగా ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ రిమాండుకు పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేనిపై 66 కేసులు నమోదు కాగా.. 22 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో […]