telangana

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్: మహమూద్‌ అలీ

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఖైదీల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. అన్ని జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. ఖైదీలకు శిక్షణ, విద్య అందిస్తున్నామన్నారు. ఒకసారి జైలుకు వచ్చిన ఖైదీ మంచి మార్పుతో బయటికి వస్తున్నారన్నారు. ఇది అధికారుల సరైన శిక్షణ వల్లనే సాధ్యమని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. తదుపరి విచారణ జరిగే వరకు విడుదల చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అందుకే.. ఇక నేను తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నాని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హుజూర్‌నగర్, […]

తెలంగాణ కొత్త CSగా సోమేశ్ కుమార్

తెలంగాణ కొత్త CSగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న ఆయన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం మంగళవారంతో ముగిసింది. కొత్త సీఎస్‌ రేసులో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌, శాంతికుమారి, అధార్‌సిన్హా పేర్లు వినిపించాయి. అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌ రేసులో ముందుండగా.. సీఎం కేసీఆర్ సోమేశ్ కుమార్ వైపే మొగ్గారు. సోమేష్‌కుమార్‌కు మరో మూడన్నరేళ్ల […]

చలి పంజా.. గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి గుప్పిట్లో చిక్కుకుంది. రాత్రిపూట రోజురోజుకి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి దాటికి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. గత రెండు రోజుల్లోనే చలి తీవ్రతకు 10 డిగ్రీలకు పడిపోయింది. తీవ్రమవుతున్న చలితో జనం గజగజ వణికిపోతున్నారు. రాత్రిపూట రెండు రోజుల క్రితం 17 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 6, 7 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని […]

తెలంగాణలో నెక్స్ట్ బాస్ ఎవరు?

తెలంగాణలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రస్తుత CS జోషి మంగళవారం రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో అజయ్ మిశ్రా, బినయ్ కుమార్, బిపి ఆచార్య, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, సోమేష్ కుమార్, చిత్ర రామచంద్రన్‌, హీరాలాల్‌ సమారియా ఉన్నారు. వారిలో ఎవరిని CS పదవి వరిస్తుందన్నది సచివాలయ వర్గాల్లో […]

తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం.. ఇక ఎన్నారై అల్లుళ్లకు మోత మోగినట్టే

ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా తనకూతురు అత్తారింట్లో సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. వారి వారి స్థాయికి తగ్గట్టు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారికి ఇచ్చి వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక విదేశీ సంబంధం అంటే ఇక చెప్పనక్కరలేదు. ఆస్థిపాస్తులు అన్ని అమ్మి అయినా సరే అడిగినంత కట్నకానులు ఇచ్చి పెళ్లిచేస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ విదేశాల్లోని కొందరు అల్లుళ్లు అదనపు కట్నం కోసం […]

CAA పై అవగాహన కల్పించేందుకు తెలంగాణలో బీజేపీ సభలు

పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో.. బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యక్ష్యంగా రంగంలో దిగింది. దేశ ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో మూడు చోట్ల సీఏఏ మద్దతు సభలు నిర్వహించనున్నారు. విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యంగా సభలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, గద్వాలలో నిర్వహించే […]

100కు దగ్గర్లో ఆర్ఎస్ఎస్.. తెలంగాణాలో జెండా పాతేందుకు వ్యూహం

మరో ఐదేళ్ళలో వందేళ్ళు పూర్తి చేసుకోనున్న ఆరెస్సెస్.. దేశంలో మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ సైద్ధాంతికకర్తగా ఆ పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా బలహీన ప్రాంతాల్లో బలోపేతం కావడంపై సంఘ్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాను బలపేతం అవుతూ.. బీజేపీ ఎదుగుదలకు బాటలు వేయాలని సంకల్పించింది. 95 ఏళ్ల క్రితం […]

మోగిన పురపాలక నగారా

  తెలంగాణలో పురపాలక ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. 25న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. జనవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై […]