తాను నిజంగా తప్పు చేశానని ప్రజలు భావిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి 13 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుండి విడుదల అయిన ఆయన.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కావాలనే సెక్షన్ 30 పెట్టి పోలీసులు ఉద్యోగ ధర్మాన్ని తప్పుతున్నారని విమర్శించారు. పోలీసుల సహాయంతో […]

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైని వివాహం నవంబర్‌ 21న ఢిల్లీలో జరుగనుంది. అనంతరం రెండు రోజుల తరువాత నవంబర్ 23 న రిసెప్షన్ ఉంటుందని షైని కుటంబసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానితులకు వివాహ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. అంగద్, అదితి ఇద్దరూ 2017 లో ఎమ్మెల్యే అయ్యారు.. వారిద్దరిది […]

చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని వీడింది.ఈ కేసులో నిందితుడైన లారీ డ్రైవర్ రఫీని ఛత్తీస్‌గడ్‌లోఅరెస్ట్ చేశారు పోలీసులు. మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. చిన్నారి వర్షితకు చాక్లెట్ ఆశ చూపించి రఫీ తన వెంట తీసుకెళ్లాడని, అత్యాచారం చేసి ఆపై హతమార్చినట్లు తెలిపారు ఎస్పీ సెంథిల్‌ కుమార్. సీసీటీవీ ఫుటేజీ, ఊహాచిత్రాల సాయంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. రఫీ స్వస్థలం మదనపల్లె మండలం బసినికొండ. బాల […]

టీడీపీ నేతలకు మరోసారి కౌంటర్‌ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని వంశీ ప్రకటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నిచంఆరు. మీరంతా రాజీనామా చేయండి.. అప్పుడు తనను ప్రశ్నించాలని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ తనపై విమర్శలు చేయడంతో.. కాస్త కంట్రోల్‌ తప్పి మాట్లాడానని వంశీ ఒప్పుకున్నారు. గతంలో తనపై విమర్శలు చేసిన […]

టర్కీ మద్దతుగల ప్రతిపక్ష ఫైటర్స్ నియంత్రణలో ఉన్న ఉత్తర సిరియా పట్టణంలో శనివారం కార్ బాంబు పేలింది, దీంతో 12 మంది మృతి చెందారు.. అలాగే అనేక మంది గాయపడ్డారు అని సిరియా ప్రతిపక్ష కార్యకర్తలు, టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఉత్తర సిరియా అనేక పేలుళ్లతో దెబ్బతింది.. గత నెలలో అనేక మంది ప్రజలు మరణించడం కాకుండా చాలా మంది గాయపడ్డారు. ఉత్తర సిరియా నుండి […]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హస్తిన వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తారంటున్నారు. అయితే ఆయన హస్తిన పర్యటనపై ఇప్పటికీ క్లారీటీ లేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చామని ఆ పార్టీ నేత నాదెండ్ల చెప్తున్నా.. కేంద్రప్రభుత్వ, బీజేపీ […]

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయ్యప్పమాల వేసుకుని వంశీ వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. టీడీపీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన వ్యక్తులు.. ఇప్పుడు ఆ పార్టీ అధినేతనే […]

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారని అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్ సంస్థ శనివారం ప్రకటన చేసింది. అంబానీతో పాటు చాయా విరాని, రినా కరణి, మంజారి కాకర్, సురేష్ రంగాచార్ ఆర్‌కామ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. “శ్రీ మణికాంతన్ వి. ఇంతకుముందే కంపెనీ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. పైన పేర్కొన్న రాజీనామాలను కంపెనీ రుణదాతల […]

కార్మికులతో చర్చలు జరపబోము.. డిమాండ్లు పరిష్కరించలేం అంటూ ఆర్టీసీ సమ్మెపై ఎండీ సునీల్‌ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్‌ దాఖలు చేశారు. ప్రస్తుతానికి యూనియన్‌ నేతలు విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినా.. మళ్లీ ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని గుర్తు చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీకి 44శాతం నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక […]

ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు రేణు దేశాయ్. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌తో ఆమె తిరిగి నటించనున్నట్టు కూడా పేర్కొంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైగర్ నాగేశ్వర్ రావు పాత్రను బెల్లమకొండ శ్రీనివాస్ చేస్తున్నారు. రేణు దేశాయ్ గుర్రాం జాషువా కుమార్తెగా, సామాజిక కార్యకర్త హేమలత లవనం గా కనిపిస్తారని తెలిసింది. […]