మోదీ యోగాసానాల సిరీస్ లో మరో యోగాసనం రిలీజ్ అయ్యింది. యోగా డేకి ముందుగా యోగాసనాలు విడుదల చేస్తున్న మోదీ..లేటెస్ట్ గా భుజంగ ఆసనాన్ని వివరిస్తూ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేశారు. భుజంగ ఆసనం వేసే విధానం, ప్రయోజనాలు, ఆసనం వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పీఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. గత ఏడాది కూడా ప్రధాని మోదీ ఇదే తరహాలో యోగాసనాలకు […]

ఏపీకి ప్రత్యేక హోదా అంశమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని అన్నారు ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి. ప్రధాని ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించామని అన్నారాయన. ప్రత్యేక హోదా పార్లమెంట్ ద్వారా తమకు లభించిన హక్కు అని..దాన్ని నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. ఇక 9వ షెడ్యూల్ సవరించి జనాభా ప్రతిపాదికన బీసీల రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. ఇక లోక్ సభ డిప్యూటీ […]

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా కాన్ఫిడెంట్‌గా ఆడుతోంది. ఓపెనర్లు రాహుల్, రోహిత్‌శర్మ పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌పై వ్యూహం తరహాలోనే మొదటి పవర్ ప్లేలో సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చిన భారత్ భారీస్కోరుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఒక మార్పుతో బరిలోకి దిగింది. ధావన్ స్థానంలో విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చింది. అటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న పాక్ […]

మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం పడకేసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. నిర్లక్ష్యంతో సామాన్య ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. అలా వైద్యుల తీరుతో ఓ చిన్ని ప్రాణం బలైంది. పురిటినొప్పులతో బాధపడుతు ఆస్పత్రిలో చేరిన గర్బిణీకి సకాలంలో కాన్పు చేయకపోవడంతో పసికందు చనిపోయింది. రాజాపూర్ మండలం ఈద్గానిపల్లి గ్రామానికి సృజన అనే గర్భిని.. 3రోజుల క్రితం […]

రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తున్నాయి. పీసీసీ చీఫ్ వల్లే పార్టీ పరిస్థితి దారుణంగా మారిందన్న ఆయన వ్యాఖ్యలు పార్టీలో బిగ్ టాక్ మారింది. అయితే..రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మాత్రం భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ […]

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను తలపిస్తున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు సహకరిస్తుందనే నమ్మకంతో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్టు పాక్‌ కెప్టెన్‌ సర్ఫారజ్‌ చెప్పాడు. భారత్‌ విషయానికి వస్తే జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్‌ ధావన్‌ గాయంతో మూడు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్‌ కోహ్లీ. టాస్‌ ఓడి […]

వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌ కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. భారత్‌, పాక్‌ నేషనల్ ఫ్లాగ్‌ కలర్స్‌తో ఉన్న షర్ట్‌ వేసుకున్న గేల్‌…ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై తన ఆసక్తిని కనబరిచాడు.సెప్టెంబర్‌ 20న తన బర్త్‌డేకు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన గేల్‌ సెల్ఫీ వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ అత్యంత విమర్శల పాలవుతోంది. పాయంట్ల పట్టికలో వర్షంతో రద్దయిన మ్యాచ్ లు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ఎవరైనా వరల్డ్ కప్ నిర్వహిస్తారా అని అభిమానులు ప్రశ్నింస్తున్నారు. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్ లను కనులార తిలకిద్దామని ఎంతో ఆశ ఉంటుంది. కానీ వరుణుడు మాత్రం అభిమానుల ఆశలకు గండి కొడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం […]

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వస్తే ఆయన తండ్రి YSR ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ , అవకతవకలకు పరోక్షంగా సమర్థించినట్లు అవుతుంది కాబట్టి ప్రారంభోత్సవానికి రావద్దని లేఖలు కోరారు.ప్రాజెక్టుల టెండర్ల వివరాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు పెడతామన్న జగన్‌ నిర్ణయాన్ని భట్టి విక్రమార్క స్వాగతించారు. తెలంగాణలోనూ అదే తరహాలో చేయాలని డిమాండ్ చేశారు..కాళేశ్వరం […]

హైదరాబాద్ పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మైనర్లు రెచ్చిపోయారు. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రోడ్లపై డేంజర్ స్టంట్స్ చేశారు. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్, డేంజర్ స్టంట్స్ ఇతర వాహనదారులు హడలెత్తిపోయారు. అడ్డుకునే వాళ్లే లేకపోవటంతో చంద్రాయణ గుట్ట వరకు ప్రమాదకరంగా బైక్ నడుపుతూ అందర్ని భయపెట్టారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఈ పోకిరి బ్యాచ్ ర్యాష్ డ్రైవింగ్ తో చెలరేగిపోవటం అలవాటుగా మారిపోయింది. పట్టించుకోవాల్సిన పోలీసులు ఫైన్లతో […]