అమరావతి ప్రాజెక్టు తప్పని ప్రజలంటే… క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజారాజధానిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం లేనిపోని అపోహలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు  చంద్రబాబు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయామని…ఇప్పుడు రాజధాని విషయంలోనూ అన్యాయం జరిగితే మరింత […]

తనపై అభిశంసన విచారణ కొసాగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తాను అమెరికాను ఉద్దేశించే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే మీరు మాకు సాయం చేయాలని కోరానని, మాకు అంటే అమెరికా నుద్దేశించి మాట్లాడినట్లు ట్రంప్ వివరించారు. దీనిలో భాగంగానే అమెరికా అటార్నీ జనరల్ మీ వాళ్లకు ఫోన్ చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడితో అన్నానని, ఈ విషయాన్ని విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని […]

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిటి అరసకుమార్. బీజేపీకి రాజీనామా చేసి డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ సమక్షంలో డిఎంకెలో చేరారు. గురువారం ఉదయం డీఎంకే ప్రధాన కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లిన ఆయన డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు. అంతకంటే ముందు డిసెంబర్ 1 న పుదుకోట్టైలో జరిగిన వివాహ కార్యక్రమంలో అరసకుమార్ స్టాలిన్‌ను ప్రశంసించారు. పెళ్లిలో మాట్లాడుతూ, అరసకుమార్ స్టాలిన్‌ను ఎంజిఆర్‌తో […]

ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్‌కు ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదా అని జనసేన అధినేత పవన్‌ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చి గెలిపించింది రైతులను కష్టాల్లోకి నెట్టేయడానికేనా అని నిలదీశారు.. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మార్కెట్‌ యార్డులో టామోటా రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్న ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా […]

ఉల్లిధరలు జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తిరుపతి రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లి కోసం సామాన్యులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, చంటిబిడ్డలతో తల్లుల అవస్థలు చెప్పలేనివిగా ఉన్నాయి. కిలో మాత్రమే ఇస్తున్నప్పటికీ.. తూకంలోనూ మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

విధులను నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరు మానసికంగా దృఢ చిత్తంతో సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై.. రాజ్‌భవన్‌లోని భారత స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర అసోసియేషన్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పెద్ద పెద్ద సంస్థల్లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌లో విద్యార్థులను చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె […]

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు…రక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ మెట్రోలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో నిషేధం విధించారు. ఇప్పుడు పెప్పర్ స్ప్రేలను అనుమతించాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని మెట్రో రైలు ఎండీ NVS రెడ్డి తెలిపారు… ఇటీవల మహిళలపై దాడులు […]

రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్ట పరిచేందుకు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. జిల్లా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. వరుసగా మూడు రోజులూ పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. వైసీపీ దాడులతో ఇబ్బంది పడ్డ కార్యకర్తలకు ధైర్యం చెపుతూనే.. జిల్లాలో టీడీపీ బలోపేతానికి వ్యూహాలు రచించారు. కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి […]

తిరుపతిలో కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. అమిత్‌షా […]

వైసీపీ నేతలకు కండకావరం ఎక్కువైందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసులు పెడితే తీసుకోవడంలేదని, దాడి చేసిన వాళ్ల ఫిర్యాదుతో తమ పార్టీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో తమ పార్టీ వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో సీఎం జగన్‌ సాధించిందేమీ లేదని, దాడులు చేస్తూ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని […]